Vishnupriya : నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్న విష్ణుప్రియ?

తాజాగా నిన్న సింగిల్స్‌ డే అంటూ విష్ణు ప్రియ తన పెళ్లి విషయంపై స్పందించింది. నవంబర్‌ 11 సింగిల్స్‌ డే అంటూ విష్ణు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇవాళ సింగిల్స్ డే.

Vishnupriya : నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్న విష్ణుప్రియ?

Vishnupriya

Vishnupriya :  షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీకి పరిచయమై యాంకర్ గా మారి ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా మెల్లి మెల్లిగా ఎదుగుతుంది విష్ణుప్రియ. ‘పోవే పోరా’ షోతో యాంకర్‌గా బాగా పాపులారిటీ తెచ్చుకొని అభిమానులని సంపాదించింది. ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో హాట్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో మెప్పించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్, సినిమాలు చేస్తుంది విష్ణుప్రియ. ఇటవల విష్ణుప్రియ హాట్ ఫోటోషూట్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అంతేకాక పొట్టి పొట్టి బట్టలతో డ్యాన్సులు చేస్తూ కుర్రకారుకి మతి పోగొడుతుంది. సోషల్ మీడియాలోనే భీభత్సమైన ఎక్స్పోజింగ్ చేస్తుంది విష్ణు.

Brahmanandam : కేసిఆర్ కోసం కామెడీ పక్కన పెట్టాను : బ్రహ్మానందం

తాజాగా నిన్న సింగిల్స్‌ డే అంటూ విష్ణు ప్రియ తన పెళ్లి విషయంపై స్పందించింది. నవంబర్‌ 11 సింగిల్స్‌ డే అంటూ విష్ణు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇవాళ సింగిల్స్ డే. సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి అని ఉన్న పోస్ట్ షేర్ చేసి.. నెక్ట్‌ ఇయర్‌ ఖచ్చితంగా నేను సింగిల్‌గా ఉండను, నన్ను నమ్మండి. కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుంది. వీలైనంత వరకు సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేయాలి అంటూ స్టోరీ షేర్‌ చేసింది.

Allu Sirish : సోషల్ మీడియాకి దూరం అవుతున్న అల్లు శిరీష్

దీంతో నెక్స్ట్ ఇయర్ లోపు విష్ణు పెళ్లి చేసుకోబోతుందా? లేదా ఎవరితో ఐనా రిలేషన్ లో ఉండబోతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విష్ణు ఫ్యాన్స్ అయితే అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నావా అంటూ భాదపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. హాట్ యాంకర్ గా, బోల్డ్ ఆర్టిస్ట్ గా మారిన విష్ణు ప్రియ మరి త్వరలోనే పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచిస్తున్నారు.