Brahmanandam : కేసిఆర్ కోసం కామెడీ పక్కన పెట్టాను : బ్రహ్మానందం

ఇటీవల చాలా తక్కువగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో కామెడీ కాకుండా డిఫరెంట్ పాత్రని చేసినట్టు చెప్పారు. ‘తెలంగాణ దేవుడు’ మూవీ

Brahmanandam : కేసిఆర్ కోసం కామెడీ పక్కన పెట్టాను : బ్రహ్మానందం

Brahmanandam

Brahmanandam :  ‘తెలంగాణ దేవుడు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాస్య బ్రహ్మా బ్రహ్మానందం నుంచి తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. కేసిఆర్ బయోపిక్ గా ‘తెలంగాణ దేవుడు’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించగా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు. ఇటీవల చాలా తక్కువగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో కామెడీ కాకుండా డిఫరెంట్ పాత్రని చేసినట్టు చెప్పారు. ‘తెలంగాణ దేవుడు’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బ్రహ్మానందం ఇచ్చిన వీడియోలో ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి మాట్లాడారు.

Allu Sirish : సోషల్ మీడియాకి దూరం అవుతున్న అల్లు శిరీష్

బ్రహ్మానందం మాట్లాడుతూ.. డైరెక్టర్ హరీశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారు. చాలా మంచి దర్శకుడు అని అన్నారు. నా పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇందులో నేను కామెడీ చేయలేదు. కెసిఆర్ గారి బయోపిక్ లో నాకు ఏం పాత్ర ఉంటుంది అని అనుకున్నాను కానీ డైరెక్టర్ నాలో కామెడీ చూడకుండా ఆర్టిస్ట్ ని చూసి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను నాకు ఇచ్చారు. నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అన్న ఫీలింగ్ కలిగింది అన్నారు.

Radheshyam : ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లేఖ.. నా చావుకి కారణం మీరే

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. జాప్యం జరిగినా దర్శకుడు సినిమాను చాలా అద్భుతంగా తీశారు అంటూ డైరెక్టర్ ని మెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఇటీవల సినిమాల్లో ఎక్కువగా కనపడట్లేదు హాస్య బ్రహ్మ. ఆయన అభిమానులు, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మానందంని మళ్ళీ పాత రోజుల్లోలాగా ఫుల్ కమెడియన్ గా చూడాలి అని అనుకుంటున్నారు. మరి ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం బ్రహ్మానందం ‘రంగమార్తాండ’, ‘పంచతంత్ర కథలు’ సినిమాలు చేస్తున్నారు.