Chiranjeevi : కోటి ఋణం తీర్చుకోలేకపోయాను అనే బాధ ఉండేది: చిరంజీవి

80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు.. లాంటి ఎన్నో సినిమాలకు రాజ్ కోటి సంగీతం అందించారు. దాదాపు అప్పట్లో నాకు 90% సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినందుకు

Chiranjeevi : కోటి ఋణం తీర్చుకోలేకపోయాను అనే బాధ ఉండేది: చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi :  సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ హీరోగా, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా పరిచయమవుతూ కొత్త సినిమా మొదలైంది. ”11: 11” అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ప్రోగ్రాం నిన్న పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు.

Drushyam 2 : ‘దృశ్యం 2’… డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి వస్తున్న కొత్త ఆర్టిస్టులకు వెల్‌కమ్ చెప్పారు. ఈ రోజు చాలా మంచి రోజు. నా సినిమా ‘భోళా శంకర్’ కూడా ఇవాళ ఉదయమే ప్రారంభించాం అన్నారు. కోటి గారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కోటి గారితో నాకు ఉన్న అనుబంధం గొప్పదని, నా సినిమా అంటే ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆయన సంగీతం అందించేవారని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే నా విజయాలలో రాజ్- కోటి లకే ఎక్కువ భాగం ఉంది అని చిరంజీవి చెప్పారు.

Surekha Vani : దుబాయ్ లో మందు బాటిల్ తో సురేఖ.. ఇంతకన్నా ఆనందం ఏముంది అంటూ పోస్ట్

80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు.. లాంటి ఎన్నో సినిమాలకు రాజ్ కోటి సంగీతం అందించారు. దాదాపు అప్పట్లో నాకు 90% సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినందుకు కోటి గారి ఋణం తీర్చుకోలేక పోయాను అనే బాధ ఉండేది. కానీ ఇవాళ కోటి గారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కోటితో ఉన్న జ్ఞాపకాలని పంచుకున్నారు.

Marakkar : సినిమా టీంపై స్టార్ హీరో ఫాన్స్ ఆగ్రహం.. శాంతపరిచిన మినిస్టర్

కోటి తండ్రి సాలూరు రాజేశ్వరరావు గారు ఎంతో గొప్ప లెజెండరీ సంగీత దర్శకుడు. ఆయన వారసత్వాన్ని తీసుకొని కోటి గారు కూడా తండ్రి బాటలో పయనించి సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించారు. ఇప్పడు ఆయన కొడుకు హీరోగా రాబోతున్నాడు. రాజీవ్ కూడా తండ్రి, తాతల పేర్లు నిలబెడతాడు అని తెలిపారు. తర్వాత సినిమా టీం అందరికి శుభాకాంక్షలు చెప్పి ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.