Bigg Boss 5 : కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కలిసొచ్చి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా రవి

ఈ సారి మొదట్నుంచి కూడా కెప్టెన్సీ టాస్క్ ప్రశాంతంగా, ఎంటర్టైనింగ్ గా సాగింది. చివర్లో కొన్ని గొడవలు వచ్చిన గతం కంటే మేలే అనిపించాయి. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్‌ కెప్టెన్సీ

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కలిసొచ్చి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా రవి

Ravi

Bigg Boss 5 :  ప్రతి సారి బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అంటే గొడవలు ఉండేవి. చాలా గందరగోళాల మధ్య కెప్టెన్సీ విన్ అయ్యేవారు. కానీ ఈ సారి మొదట్నుంచి కూడా కెప్టెన్సీ టాస్క్ ప్రశాంతంగా, ఎంటర్టైనింగ్ గా సాగింది. చివర్లో కొన్ని గొడవలు వచ్చిన గతం కంటే మేలే అనిపించాయి. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్‌ కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన బిబి హోటల్ టాస్క్‌ ముగిసింది. టాస్క్‌ ముగిసే సమయానికి హోటల్‌ సిబ్బంది దగ్గర 9,500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అతిథులు దగ్గర నుంచి 15 వేల రూపాయలు రాబట్టనందున హోటల్‌ సిబ్బంది ఓడిపోయారని, అతిథుల టీమ్‌ గెలిచిందని ప్రకటించాడు బిగ్‌బాస్‌.

Anchor Suma : కొత్తగా జిమ్ లో కష్టపడుతున్న సుమ.. వీడియో వైరల్

ఇక ఫైనల్ టాస్క్ కి సీక్రెట్ టాస్క్ లో ఉన్న రవిని డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీకి అర్హుడిగా ప్రకటించారు. ఇక అతిధుల టీంలో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్‌ సిబ్బందిని కోరగా అందరూ కలిసి మానస్‌, ప్రియంకలను వద్దన్నారు. దీంతో సిరి, కాజల్‌, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి ‘టవర్‌లో ఉంది పవర్‌’ అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో పోటీపడే కంటెస్టెంట్స్ టవర్‌ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి.

Malavika Sundar : తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ గాయని

మొదటి లెవల్‌లో కాజల్ ఓడిపోయింది. ఆ తర్వాత ప్రియాంక చీర తగిలి సన్నీ టవర్‌ కూలిపోవడంతో సన్నీ కూడా ఓడిపోయాడు. అయితే ప్రియాంక కావాలనే టవర్‌ను కూల్చిందని అన్నాడు సన్నీ. తర్వాత సిరి కూడా ఓడిపోయింది. ఇలా కంటెస్టెంట్స్ అందరూ గొడవలు పడుతూ రవిని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రవి తన గేమ్ బాగా ఆడి మొత్తానికి టవర్‌లో ఉంది పవర్‌ టాస్క్‌లో గెలిచి రవి కెప్టెన్‌గా అయ్యాడు. ఇప్పటికే రవి గేమ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక కెప్టెన్ గా ఇంకే రేంజ్ లో ఆడతాడో చూడాలి.