Rakul Preeth Sing : కండోమ్ టెస్టర్ గా రకుల్.. షాక్ లో ఫ్యాన్స్

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది రకుల్. ఈ గ్యాప్ లో అప్పుడప్పుడు తెలుగు సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా రకుల్ బాలీవుడ్ లో ‘ఛత్రీవాలీ’ అనే సినిమాని

Rakul Preeth Sing : కండోమ్ టెస్టర్ గా రకుల్.. షాక్ లో ఫ్యాన్స్

Rakul

Rakul Preeth Sing :  ఇటీవల హీరోయిన్స్ కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్, కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేస్తున్నారు. ఇందుకోసం బోల్డ్ టాపిక్స్ ని కూడా ఎంచుకుంటున్నారు. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి వెనుకాడట్లేదు ఇప్పటి హీరోయిన్స్. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది రకుల్. ఈ గ్యాప్ లో అప్పుడప్పుడు తెలుగు సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా రకుల్ బాలీవుడ్ లో ‘ఛత్రీవాలీ’ అనే సినిమాని అనౌన్స్ చేసింది.

Karthikeya : సినిమాపై బాధపెట్టేలా విమర్శలు చేయకండి : కార్తికేయ

‘ఛత్రీవాలీ’ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా నిన్న విడుదల చేశారు. ఈ లుక్ చూసి అలాగే ఈ కథ గురించి తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఫ్యాన్స్ రకుల్ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకుందని షాక్ అవుతున్నారు.

Maha Samudram : ఓటిటిలో ‘మహా సముద్రం’

‘ఛత్రీవాలీ’ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ కండోమ్‌ టెస్టర్‌గా కనిపించబోతుంది. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ అయి ఉద్యోగం కోసం వెతికే ఓ అమ్మాయికి ప్రొఫెషనల్‌ కండోమ్‌ టెస్టర్‌గా ఉద్యోగం వస్తుంది. అయితే బయట ఈ జాబ్ చేస్తున్నాం అంటే ఏమంటారనో, బయట, ఇంట్లో చెప్పకుండా జాబ్ చేసే మహిళగా రకుల్ కనిపించబోతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక కోణంలో చూపిస్తూ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Shannu – Deppthi : బిగ్ బాస్ లో సన్నీ- షణ్ను గొడవ… సన్నీని ఏకిపారేసిన షణ్ను గర్ల్ ఫ్రెండ్

‘ఛత్రీవాలీ’ వ్యంగ్యం, హాస్యం కలిసిన ఫ్యామిలీ డ్రామా అని దర్శకుడు తేజాస్‌ ప్రభాస్‌ డీయోస్కర్‌ తెలిపారు. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రకుల్. ఈ పోస్టర్లో కండోమ్ ప్యాకెట్ ని చింపి అందులోంచి రకుల్ చూస్తున్నట్టు కొత్తగా ఉంది. ఈ పోస్టర్ షేర్ చేసి ‘సీజన్‌తో సంబంధం లేకుండా వర్షం ఎప్పుడైనా పడొచ్చు. మీ గొడుగుల్ని సిద్ధం చేసుకొని ఉంచుకోండి’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తీసుకునేందుకు అభినందిస్తుంటే, కొంతమంది ఇలాంటి క్యారెక్టర్ అవసరమా అంటూ విమర్శిస్తున్నారు.

NBK 107 : బాలయ్య యాక్షన్ మొదలైంది

ఇప్పటిదాకా ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు కాబట్టి సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి క్యారెక్టర్ తో రకుల్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.