Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు

వినాయక చవితి పండుగ సందర్భంగా 200ల కేజీల డార్క్ చాక్లెట్ తో వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాడు.

Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు

200kg Dark Chocolate Ganpati (1)

200 KG Dark chocolate Vinakaya : దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు గణపయ్యను పూజించుకోనున్నారు భక్తులు. ఎన్నో రూపాల్లో ఒదిగిపోయే గణపతి ఎన్నో రూపాల్లో..మరెన్నో నామాల్లో పూజలు అందుకుంటున్నాడు. అలా ఓ చోట గణేషుడు తియ్యతియ్యగా నోరూరిస్తున్నాడు.ఏకంగా 200ల కేజీల డార్క్ చాక్లెట్ తో వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

Read more :Vaccine Vinayaka : వ్యాక్సిన్ వినాయకుడు..టీకా వేయించుకుంటేనే రమ్మంటున్నాడు..

ఈ చాక్లెట్ గణపయ్య భక్తులకు కనువిందు చేయటమే కాదు చిన్నారుల నోరు ఊరిస్తున్నాడు. ఈ చాక్లెట్ వినాయకుడిని తయారుచేసిన కళాకారుల ప్రతిభకు ఫిదా అవుతున్నారు భక్తులు. పంజాబ్‌లోని లూథియానాలో ఏర్పాటు చేసిన ఈ డార్క్ చాక్లెట్ గ‌ణ‌ప‌తికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more :Ganesh Chaturthi 2021: వినాయక చవితి సందర్భంగా ఆ గణపతికి రూ.6కోట్ల విలువైన కిరీటం
ఈ వీడియోను చాక్లెట్ వ్యాపారి హర్జిందర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పంజాబ్‌లోని లుథియానాలో బేకరీ షాపులో కొలువుదీరిన ఈ డార్క్ చాక్లెట్ ఉండ్రాళ్లయ్య అందరినీ అలరిస్తున్నాడు. బ్యాకరీ యజమాని హర్జిందర్ సింగ్ మాట్లాడుతూ తాను గత ఆరేళ్లుగా ఇటువంటి చాక్లెట్ గణపతి ప్రతిమలను రూపొందిస్తున్నానని..ఈ ఏడాది ఈ డార్క్ చాక్లెట్ గణపతి బొమ్మరగ 200కిలో చాక్లెట్లను ఉపయోగించానని తెలిపారు.

Read more : Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

ఈ సందర్భంగా హర్జిందర్ సింగ్ మాట్లాడుతు..ప‌ర్యావ‌ర‌ణహితంగా వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు కోరారు. ఈ వినాయకుడిని తయారు చేయటానికి 10 మంది చెఫ్‌లు 10 రోజుల పాటు శ్ర‌మించార‌ని తెలిపారు. ఈ విగ్ర‌హాన్ని పాల‌ల్లో నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని.. ఆ త‌ర్వాత పిల్ల‌ల‌కు ప్ర‌సాదంగా పెడతామని తెలిపారు.

 

– – –