Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

కరోనా పీడ ఇంకా మన సమాజాన్ని వీడలేదు. దేశంలో ఇంకా సెకండ్ వేవ్ తగ్గకముందే మరోవైపు థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ల భయాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

Punjab Govt

Punjab Govt: కరోనా పీడ ఇంకా మన సమాజాన్ని వీడలేదు. దేశంలో ఇంకా సెకండ్ వేవ్ తగ్గకముందే మరోవైపు థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ల భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేంద్రం నుండి రాష్ట్రాల వరకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద ఫోకస్ చేసి ముమ్మరం చేపడుతున్నాయి. ప్రజలు కూడా వ్యాక్సిన్ తీసుకొనేందుకు ముందుకు వస్తుండడంతో వ్యాక్సిన్ తీసుకొనే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. అయితే కొందరు మాత్రం భయం కారణంగానో.. నిర్లక్ష్యం కారణంగానో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.

Sudheer-Rashmi: తొమ్మిదేళ్ల ప్రేమకు శుభం కార్డ్.. పెళ్లి పీటలెక్కుతారా?

ఇలా ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులపై పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇవ్వనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఈ నెల 15 తర్వాత సెలవుపై పంపిస్తామని సీఎం స్పష్టంచేశారు.

Weather Update: అల్పపీడనం… 4 రోజుల పాటు భారీ వర్షాలు!

ఏ స్థాయి ఉద్యోగులైనా సరే కనీసం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే కార్యాలయాలలోకి అనుమతి ఉంటుందన్నారు. తీవ్రమైన ఆరోగ్య కారణాలు ఉన్నవారికి ఇందులో మినహాయింపు ఉంటుందన్న సీఎం ఇతర కారణాలతో వ్యాక్సిన్ తీసుకొని వారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక విద్యాసంస్థల విషయానికి వస్తే కనీసం 4 వారాల ముందు వ్యాక్సిన్ తీసుకున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ స్టాఫ్‌నే అనుమతించనున్నారు. లేదంటే వారు వారానికొక సారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సి ఉంటుందని చెప్పారు.