Sudheer-Rashmi: తొమ్మిదేళ్ల ప్రేమకు శుభం కార్డ్.. పెళ్లి పీటలెక్కుతారా?

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. ఈ జంట యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ అన్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు పలు టీవీషోల్లో కొందరిని జంటలు చేసి లవ్ ప్రపోజల్స్..

10TV Telugu News

Sudheer-Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. ఈ జంట యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ అన్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు పలు టీవీషోల్లో కొందరిని జంటలు చేసి లవ్ ప్రపోజల్స్, రిలేషన్స్ సృష్టించి ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి షోలన్నటికీ సుధీర్-రష్మీ జంటనే ఇన్స్పిరేషన్. ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఈ జంట మధ్య షోలో ప్రసారమైన లవ్ ట్రాక్ వందల సార్లు ప్రసారం చేసినా వ్యూస్ లో క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే షోస్ నిర్వాహకులు సైతం ఈ జంట మధ్య లవ్ అనే అంశాన్ని ఆ మధ్య పెళ్లి పీటల మీదకి కూడా తీసుకెళ్లారు.

Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

ఈ జంట గురించి గత కొన్నేళ్లుగా ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నా.. ఈ ఇద్దరి మధ్య ఏముందంటే ఎవరికి అంతు చిక్కే వ్యవహారమే కాదు. ఎప్పటికప్పుడు ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో హాట్ టాపిక్ గా మారడం.. ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పడం షరామామూలే అన్నట్లుగా సాగిపోతుంది. అయితే.. ఇప్పటి వరకు చేసిన షోస్ అన్నిటిలో సుధీర్ పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ రష్మీకి ప్రపోస్ చేసేవాడు కాగా ఇప్పుడు రష్మీ పాటలు పడుతూ స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తూ సుధీర్ కి ప్రపోజ్ చేసింది.

Big Boss 5: ఎలిమినేషన్‏లో ఆరుగురు.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

వినాయక చవితి స్పెషల్ ఊర్లో వినాయకుడు షోలో ఈ జంట రొమాన్స్ మరోసారి చర్చగా మారింది. ఇందులో ఈ జంట 9 సంవత్సరాల లవ్ స్టోరీ సీన్స్ ఓ రేంజ్‌లో ఆకర్షించగా.. గత జ్ఞాపకాలు గుర్తుచేస్తూ ‘9 సంవత్సరాల తీపి గుర్తులను 9 గిఫ్ట్‌లుగా నీకు గుర్తుండి పోయేలా ఇస్తున్నా’ అంటూ ప్రేమ పాటల రూపంలో అందరూ ఫిదా అయ్యేలా సుధీర్‌పై మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టేసింది రష్మీ. ఒకరకంగా చెప్పాలంటే ఈ జంట ప్రేమకి శుభం కార్డు పడిందనేలా ఉంది ఈ రొమాంటిక్ సీన్. సుధీర్- రష్మీ ఒకరిని ఒకరు హగ్ చేసుకొని ప్రేమ మైకంలో చూపిన హావభావాలు హైలైట్ అయ్యాయి.

Weather Update: అల్పపీడనం… 4 రోజుల పాటు భారీ వర్షాలు!

రష్మీ ప్రపోజల్, సుధీర్ ఎమోషన్ చూసిన రోజా.. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు.. మీ ఇద్దరి గురించి తెలిసిన వాళ్లందరికీ మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పింది. ఇంద్రజ అయితే ఏకంగా రశ్మీ నోటితో సుధీర్ ప్రేమను అంగీకరించానని చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారమంతా చూస్తే నిజంగానే ఈ జంట ప్రేమకి శుభం కార్డు పెట్టేసేలానే ఉందని చూసిన వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. మరి పెళ్లి పీటల వరకు వెళ్తారా? ఏమో గతంలో ఇంతకి మించిన ఎమోషన్స్ తో ఏకంగా పెళ్లి కూడా చేసి శోభనం గదిలోకి పంపారు. కానీ చివరికి అది కూడా తూచ్ అన్నారు. మరి ఇప్పుడు ఇది మాత్రం నమ్మే పరిస్థితి ఉందంటారా?