Big Boss 5: ఎలిమినేషన్‏లో ఆరుగురు.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

టైం ఎవరి కోసం ఆగదు కదా.. రాకముందు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ మొదలై వారం గడిచిపోతుంది. తొలి వారం కాస్త కాంట్రవర్సీ, ఇంకాస్త ఎమోషన్ అన్నట్లు సాగింది.

Big Boss 5: ఎలిమినేషన్‏లో ఆరుగురు.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

Big Boss 5 Telugu

Big Boss 5 Telugu: టైం ఎవరి కోసం ఆగదు కదా.. రాకముందు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ మొదలై వారం గడిచిపోతుంది. తొలి వారం కాస్త కాంట్రవర్సీ, ఇంకాస్త ఎమోషన్ అన్నట్లు సాగింది. ఒకరిద్దరూ వారం గడుస్తున్నా అమాయకంగానే నెట్టుకొస్తుంటే మరికొందరు మాత్రం పక్కా ప్లాన్ గా గేమ్ ఆడుతూ హౌస్ లో తిష్ట వేసేందుకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారు. కాగా, బిగ్ బాస్ కూడా తన పని తాను మొదలు పెట్టాడు. తొలి వారం ఎలిమినేషన్ మొదలు పెట్టిన బిగ్ బాస్ ఇప్పటికే టాస్క్ ద్వారా ఆరుగురిని ఎలిమినేషన్ లో జోన్ లోకి నెట్టాడు.

Sudheer-Rashmi: తొమ్మిదేళ్ల ప్రేమకు శుభం కార్డ్.. పెళ్లి పీటలెక్కుతారా?

కంటెస్టెంట్ల ఫోటోలు చెత్త మూటల మీద ముద్రించి కంటెస్టెంట్లకు నచ్చని మూటని ఒక చెత్తకుండీలో పడేయాలని తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు రేపడంతో యాంకర్ రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లారు. ఈ ఆరుగురిని ఎలిమినేషన్ జోన్ లోకి పంపిన బిగ్ బాస్ వీరిలో ఎవరు ఇంట్లో ఉండాలో.. ఎవరు బయటకి పంపాలో ప్రేక్షకులని డిసైడ్ చేసే అవకాశం ఇవ్వగా మరి వీరిలో తొలివారం ఎవరు ఎలిమినేషన్‌ గండం గట్టెక్కేది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఆసక్తిగా మారింది.

Weather Update: అల్పపీడనం… 4 రోజుల పాటు భారీ వర్షాలు!

ఎలిమినేషన్ జోన్ లో ఉన్న వారిలో యాంకర్ రవికి బయట ఉన్న గుర్తింపుతో ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉండగా ఆర్జే కాజల్‌కు కూడా బయట మంచి గుర్తింపుతో హౌస్ గేమ్ ప్లాన్ లో కూడా దూసుకుపోతుంది. ఇక సీరియల్ నటుడు మానస్, మోడల్ జశ్వంత్ అమాయకంగా కనిపిస్తూ సింపతితో మొదటి వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ హమీదా ఈ వారం అందరి కంటే డేంజర్ జోన్ లో ఉండగా.. సరయు కూడా డేంజర్ జోన్లోనే ఉండడంతో వీరిలో ఎవరు హౌస్ నుండి బయటకు రానున్నారని ఆసక్తిగా మారింది.