30 weds 21 : ’30 వెడ్స్​ 21′ సీజన్ 2.. మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా??

ఇటీవల '30 వెడ్స్​ 21' సీజన్ 2 ఫస్ట్​ లుక్​​ను ప్రకటించి సోమవారం '30 వెడ్స్​ 21' రెండో సీజన్​ టీజర్​ను విడుదల చేశారు. ''ఇక మనిద్దరి మధ్య ఏమి రావు అంటూ పృథ్వీ క్యారెక్టర్ చెప్పే.....

30 weds 21 :  ’30 వెడ్స్​ 21′ సీజన్ 2.. మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా??

30 Weds 21

30 weds 21 :   గత సంవత్సరం యూట్యూబ్​లో విడుదలై బాగా పేరు తెచ్చుకొని, ప్రేక్షకులకి బాగా నచ్చిన వెబ్ సిరీస్ లలో ’30 వెడ్స్​ 21′ ఒకటి. 30 ఏళ్ల బ్యాచిలర్​కు 21 ఏళ్ల అమ్మాయితో వివాహం అయితే వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో కామెడీ, ఎమోషనల్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఇందులో మెయిన్ లీడ్స్ లో నటించిన చైతన్య, అనన్య అందర్నీ మెప్పించారు. ఈ సిరీస్ బాగా హిట్ అవ్వడంతో, యూట్యూబ్ లో కూడా ఎక్కువ వ్యూస్ సంపాదించడంతో రెండో సీజన్ ని కూడా ప్లాన్ చేశారు.

Vijay Devarakonda : ప్రియమణి అన్ని భాషలకి సరిపోతుంది

ఇటీవల ’30 వెడ్స్​ 21′ సీజన్ 2 ఫస్ట్​ లుక్​​ను ప్రకటించి సోమవారం ’30 వెడ్స్​ 21′ రెండో సీజన్​ టీజర్​ను విడుదల చేశారు. ”ఇక మనిద్దరి మధ్య ఏమి రావు అంటూ పృథ్వీ క్యారెక్టర్ చెప్పే డైలాగ్​తో టీజర్​ ప్రారంభమవుతుంది. ఈ టీజర్ లో వాళ్లిద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం చూపించారు. ఆఖర్లో నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి, మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. మేఘన వెల్కమ్ టు అడల్ట్ హుడ్” అనే డైలాగ్​ తో టీజర్ ముగిసింది. ఈ సిరీస్ అభిమానులు ’30 వెడ్స్​ 21′ సీజన్ 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వ్యాలెంటైన్స్ డే రోజు మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. మరి గతంలో లాగా ఈ సీజన్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి.