Vijay Devarakonda : ప్రియమణి అన్ని భాషలకి సరిపోతుంది
'భామా కలాపం' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘భరత్ కమ్మతో తన మొదటి సినిమా డియర్ కామ్రేడ్ సినిమా చేశాం. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను............

Vijay Devarakonda
Priyamani : కరోనా రాకతో ఓటీటీ వాడకం పెరగడంతో అన్ని ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ పై దృష్టి సారించాయి. తెలుగు ఓటీటీ ఆహా ప్రతి వారం కొత్త సినిమా లేదా కొత్త సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంది. తాజాగా ప్రియమణి మెయిన్ లీడ్ లో ‘భామా కలాపం’ అనే సినిమా ఆహాలో రాబోతుంది. ప్రియమణి నటించిన ఈ వెబ్ సినిమాని అభిమన్యు తాడిమేటి తెరకెక్కించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మించారు. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు.
ఇటీవల ‘భామా కలాపం’ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. రౌడీ స్టార్ విజయదేవరకొండ ఈ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులతో సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయదేవరకొండ ప్రియమణి గురించి, భరత్ కమ్మ గురించి మాట్లాడారు.
Telugu Movies : సినిమాల రిలీజ్ డేట్స్ పై దిల్‌రాజు ప్రెస్‌మీట్
‘భామా కలాపం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘భరత్ కమ్మతో తన మొదటి సినిమా డియర్ కామ్రేడ్ సినిమా చేశాం. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను. నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రమది. బాపినీడు, ప్రసాద్ గారికి, డైరెక్టర్ అభికి అభినందనలు. ఇక ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన సూట్ అయిపోతారు. అన్ని భాషల్లోనూ ప్రియమణి అద్భుతంగా నటిస్తారు. ఇప్పుడు ఆమె తెలుగు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఆమె చేసిన ‘భామా కలాపం’ ఒరిజినల్ ద్వారా. ఇది ఫిబ్రవరి 11న ఆహాలో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.