Vijay Devarakonda: ఫుల్ జోష్‌లో రౌడీ హీరో.. విజయ్ కాన్ఫిడెన్స్‌కి రీజనేంటి?

రసగా ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వరస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. రెండేళ్ల నుంచి తెరకెక్కుతున్న లైగర్ రిలీజ్ కాకముందే..

Vijay Devarakonda: ఫుల్ జోష్‌లో రౌడీ హీరో.. విజయ్ కాన్ఫిడెన్స్‌కి రీజనేంటి?

ఈ సినిమా లాంఛ్‌లో భాగంగా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda: వరసగా ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వరస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. రెండేళ్ల నుంచి తెరకెక్కుతున్న లైగర్ రిలీజ్ కాకముందే.. అదే డైరెక్టర్ తో మరో క్రేజీ మూవీ స్టార్ట్ చేసేశాడు. స్టార్ హీరో సినిమాలే ఈ మద్య బాలీవుడ్ దగ్గర బోల్తా పడుతున్నాయి.. అలాంటిది భారీ బడ్జెట్ తో బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ కాన్ఫిడెన్స్ కి రీజనేంటి..?

Vijay Devarakonda: జనగణమన అంటూ యుద్ధంలోకి దూకిన దేవరకొండ

షార్ట్ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అంటూ అప్పుడప్పుడు ఆడియన్స్ ని సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. మిగతా హీరోలెవరకూ తననెవరకూ మ్యాచ్ చెయ్యలేనంత క్రేజీ ఫాన్స్ తో దూసుకెళుతున్న ఈ రౌడీ హీరో పూరీజగన్నాధ్ తన సెకండ్ మూవీ జనగణమన మొదలుపెట్టేశాడు.

Vijay Devarakonda: రౌడీ హీరో నయా యాంగిల్స్.. మిలిటరీ మేకోవర్!

డిఫరెంట్ యాటిట్యూడ్ తో యూత్ లో మ్యాసివ్ ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పూరీ జగన్నాధ్ తో రెండేళ్ల క్రితం లైగర్ స్టార్ట్ చేశాడు. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇంకా రిలీజ్ కాలేదు.. కానీ పూరీ-విజయ్ కాంబినేషన్లో కొత్త సినిమా జనగణమన మాత్రం మొదలైపోయింది. పూరీ కనెక్ట్స్, శ్రీకర ప్రొడక్షన్స్ కంబైన్డ్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ మూవీ జనగణమన కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే భారీగా తెరకెక్కబోతోంది. అంతేకాదు.. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ 3న రిలీజ్ చెయ్యబోతున్నట్టు కూడా అనౌన్స్ చేసేశారు విజయ్.

Vijay Devarakonda: స్పీడ్ పెంచిన రౌడీ.. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు!

విజయ్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు చేసుకంటూ బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమాలు చేసే స్తాయికి వెళ్లాడు. అసలే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులు.. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా ఈ రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. అసలు విజయ్ కున్న కాన్ఫిడెన్స్ ఏంటని సర్ ప్రైజ్ అవుతున్నారు మిగతా హీరోలు. కానీ విజయ్ మాత్రం లైగర్ కున్న క్రేజ్ తోనే.. కెరీర్ కి లైగర్ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఇలా స్పీడ్ పెంచారని టాక్.

Vijay Devarakonda : విజయ్, రష్మికల పెళ్లి వార్తలు.. సెటైర్ వేస్తూ ఫైర్ అయిన రౌడీ హీరో..

సాలా క్రాస్ బ్రీడ్ అంటూ ఆడియన్స్ లో హిస్టీరియా క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఇండియా మొత్తం లైగర్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటూ ఎక్స్ పెక్టేషన్స్ ఎప్పటి కప్పుడు పెంచేస్తూనే ఉన్నారు విజయ్ దేవరకొండ. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా బాలీవుడ్ ప్రొడ్యూసర్లే కాకుండా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ యాడ్ అవ్వడంతో సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. అంతేకాదు.. పాన్ ఇండియా హీరోగా ఈ రేంజ్ లో తెరకెక్కుతున్న లైగర్.. విజయ్ కెరీర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందని అందుకే లైగర్ మీద గట్టిగా కాన్సన్ ట్రేట్ చేశారని టాక్. అందుకే విజయ్ లైగర్ సక్సెస్ మీద అంత కాన్పిడెంట్ గా ఉన్నాడని, బ్యాక్ టూబ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడని అనుకుంటున్నారు ఫాన్స్.