Vijay Devarakonda: రౌడీ హీరో నయా యాంగిల్స్.. మిలిటరీ మేకోవర్!
అన్ని రకాలుగా మెప్పిస్తా అంటున్నాడు విజయ్ దేవరకొండ. కొత్త కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడమే టార్గెట్ గా ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగానే రౌడీబాయ్ కొత్తగా..

Vijay Devarakonda
Vijay Devarakonda: అన్ని రకాలుగా మెప్పిస్తా అంటున్నాడు విజయ్ దేవరకొండ. కొత్త కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడమే టార్గెట్ గా ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగానే రౌడీబాయ్ కొత్తగా చేయబోతున్న క్యారెక్టర్ ఇప్పుడు హాట్ టాపికయింది. ఈ నయా మేకోవర్ తో పాటూ విజయ్ ఫ్యూచర్ మూవీ రోల్స్ కూడా ఆడియెన్స్ కు సూపర్ కిక్ ఇవ్వబోతున్నాయి.
Vijay Devarakonda: స్పీడ్ పెంచిన రౌడీ.. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు!
కొత్తగా ట్రై చేస్తా అంటున్నాడు విజయ్ దేవరకొండ. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కాస్త బయటికొచ్చి నయా యాంగిల్స్ చూపించబోతున్నాడు. ఆగిపోయిందనుకున్న శివనిర్వాణ సినిమాను పట్టాలెక్కించేస్తోన్న రౌడీబాయ్.. ఆ ప్రాజెక్ట్ కోసం మిలిటరీ ఆఫీసర్ లుక్ లో మేకోవర్ అయ్యాడు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో.. అక్కడే హీరోయిన్ సమంతాతో లవ్ ట్రాక్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో మొదలు కాబోతున్న శివ మూవీ కోసం ఇప్పటికే విజయ్ మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు.
Vijay Devarakonda: రౌడీ హీరో షాకింగ్ లుక్.. ఇదేంటి గురూ!
లైగర్ తర్వాత పూరీ-విజయ్ కాంబినేషన్ లో జనగణమన స్టార్ట్ కాబోతుంది. శివ నిర్వాణ మూవీ తర్వాత సెట్స్ పైకెళ్లే పూరి మూవీలోనూ మాక్సిమమ్ మిలిటరీ లుక్ లోనే రౌడీబాయ్ నటించబోతున్నాడు. మిలిటరీ కటింగ్ తో ఉండే యాంగ్రీ అగ్రెస్సిన్ యంగ్ మ్యాన్ ను జనగణమనలో ప్రజెంట్ చేయబోతున్నాడు పూరీ జగన్నాథ్. లైగర్ కోసం విజయ్ ను బాక్సర్ లుక్ లో పూర్తిగా మార్చేసాడు పూరీ. టీజర్ చూస్తేనే బాక్సింగ్ డైనమైట్ గా రౌడీబాయ్ లుక్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.