Aarya 3 : విజయదేవరకొండ సినిమా తర్వాత ‘ఆర్య 3’ ఉండొచ్చేమో

తన తర్వాతి ప్రాజెక్ట్స్ ని కూడా వెల్లడించారు సుకుమార్. ఇప్పటికే విజయదేవరకొండతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. 'పుష్ప' పార్ట్ 2 షూటింగ్ తర్వాత ఈ సినిమా ఉండొచ్చు.......

Aarya 3 : విజయదేవరకొండ సినిమా తర్వాత ‘ఆర్య 3’ ఉండొచ్చేమో

Aarya3

Aarya 3 :  సుకుమార్ సినిమాల స్టయిలే వేరు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్ని లవ్ సినిమాలే తీశాడు. లవ్ స్టోరీలతోనే ప్రయాణం మొదలు పెట్టాడు. కానీ తర్వాత తర్వాత కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు ఫుల్ మాస్ సినిమాల్లోకి దిగాడు. వెంటవెంటనే రెండు మాస్ సినిమాలతో తనలోని మరో కోణాన్ని చూపించాడు సుక్కు. రంగస్థలం లాంటి భారీ హిట్ సినిమా తర్వాత ‘పుష్ప’ సినిమాతో మరోసారి ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాని అందించాడు సుకుమార్. ఈ సినిమా మొన్న రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకుపోతుంది.

ఈ సందర్భంగా సినిమా సక్సెస్ గురించి మీడియాతో మాట్లాడుతూ తన తర్వాతి ప్రాజెక్ట్స్ ని కూడా వెల్లడించారు సుకుమార్. ఇప్పటికే విజయదేవరకొండతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ తర్వాత ఈ సినిమా ఉండొచ్చు అని అంచనా. లేదా బన్నీ నెక్స్ట్ బోయపాటి సినిమా చేస్తే విజయ్ ‘లైగర్’ సినిమా అయిపోగానే సుక్కు – విజయ్ దేవరకొండ సినిమా ఉండొచ్చు అని సమాచారం.

Samantha : ఐటెం సాంగ్‌కి సమంత ఒప్పుకోలేదు.. నేనే ఒప్పించాను

అయితే లవ్ స్టోరీస్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు నాకు వయసు అయిపోతుంది అందుకే లవ్ స్టోరీస్ రాయలేకపోతున్నాను. త్వరలో మళ్ళీ ఒక లవ్ స్టోరీ రాస్తానేమో అన్నారు. అది ‘ఆర్య 3’ సినిమానే అవ్వొచ్చు. ‘ఆర్య 3’ తీసే ప్లాన్స్ లో కూడా ఉన్నాను అని తెలిపారు. అంతే కాక భవిష్యత్తు లో మళ్ళీ మహేష్ తో మరో సినిమా ఉండే అవకాశం ఉందని తెలిపారు.