Samantha : ఐటెం సాంగ్‌కి సమంత ఒప్పుకోలేదు.. నేనే ఒప్పించాను

ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సక్సెస్ మీట్ లో సుకుమార్ ఆసక్తికర విషయాలను..........

Samantha : ఐటెం సాంగ్‌కి సమంత ఒప్పుకోలేదు.. నేనే ఒప్పించాను

Samantha

Samantha :  బన్నీ-సుక్కు కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా మంచి టాక్ తెచ్చుకొని విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో గా ఈ సినిమాని నడిపించాడు. ముందు నుంచి ఈ సినిమా టీజర్, సాంగ్స్ బాగా వైరల్ అవడంతో జనాలకి సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్టు సినిమాని కూడా గ్రాండ్ గా తీశారు. అయితే ఇప్పుడు కేవలం పార్ట్ 1 మాత్రమే విడుదల చేశారు. పార్ట్ 2 తర్వాత రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సక్సెస్ మీట్ లో సుకుమార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా సమంత ఐటెం సాంగ్ నిలిచిందని చెప్పొచ్చు. ‘ఊ అంటావా మామ… ఊ ఊ అంటావా మామ…’ అంటూ సమంత ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. ఈ పాటకి భారీ స్పందన లభించింది. చైతూతో విడాకుల తర్వాత మొదటి సారి ఇలా ఐటెం సాంగ్ తో తెర మీద కనపడటంతో ఈ సాంగ్ పై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ సాంగ్ కి సమంత ముందు ఒప్పుకోలేదట.

Pushpa: తగ్గేదేలే.. హీటెక్కిస్తున్న పుష్పరాజ్ లెక్కలు!

సుకుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “ఈ సినిమాలో స్పెషల్‌సాంగ్‌ చేయడానికి ముందు సమంత అంగీకరించలేదు. నేను కన్విన్స్‌ చేశాను. ‘రంగస్థలం’లో పూజాహెగ్డే స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఒక యాక్టర్‌ అన్నాక అన్ని చేయాలి, అన్ని రకాలుగా నటించగలగాలి అని చెప్పి కన్విన్స్ చేశాను. నా మాట విని సమంత ఇందులో స్పెషల్ సాంగ్ కి ఒప్పుకుంది. ఈ సాంగ్ కి సమంత 100 శాతం న్యాయం చేసింది. బయట, థియేటర్స్ లో ఈ పాటకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది” అని తెలిపారు. మొత్తానికి సుక్కు దయవల్ల సమంతని ఐటెం సాంగ్ లో చూడగలిగాం అని అభిమానులు, ప్రేక్షకులు అనుకుంటున్నారు.