Pushpa: తగ్గేదేలే.. హీటెక్కిస్తున్న పుష్పరాజ్ లెక్కలు!

లెక్క పెరగాలే కానీ తగ్గేదే లే అంటున్నాడు పుష్ప రాజ్. ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో సాటిస్ ఫై చేసిన అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు.

Pushpa: తగ్గేదేలే.. హీటెక్కిస్తున్న పుష్పరాజ్ లెక్కలు!

Pushpa Raj

Pushpa: లెక్క పెరగాలే కానీ తగ్గేదే లే అంటున్నాడు పుష్ప రాజ్. ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో సాటిస్ ఫై చేసిన అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. బన్నీ – సుకుమార్.. హ్యాట్రిక్ మూవీపై ఫస్ట్ నుంచి పెంచుకున్న అంచనాలకు తగ్గట్టు.. రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్మురేపుతోంది పుష్ప ది రైజ్. 2021లో సాలిడ్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది పుష్ప. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ నంబర్ వన్ పొజిషన్ లో కూర్చున్నాడు పుష్పరాజ్.

Bigg Boss 5 Telugu: గ్రాండ్ ఫినాలే.. ఈ సీజన్‌లో డబ్బు తీసుకొని తప్పుకొనేదెవరు?

అఖండ, సూర్యవంశీ, మాస్టర్, అన్నాత్తే.. ఆఖరికి వకీల్ సాబ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసి 63కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ సృష్టించాడు ఐకాన్ స్టార్. అంతేకాదు నైజాం ఏరియాలో పదకొండున్నర కోట్ల వసూళ్లతో టాప్ 1 ప్లేస్ కి రీచయింది పుష్ప. ఇప్పటివరకు ఫస్ట్ నాలుగు స్థానాల్లో ఉన్న సాహో, బాహుబలి2, వకీల్ సాబ్, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఈ కొత్త లెక్కలతో వెనకపడ్డాయి. టోటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలెక్షన్స్ దాదాపు 25 కోట్లను క్రాస్ చేసింది. ఏపీలో టికెట్ రేట్ పెంచుంచే లెక్క వేరే ఉండేదనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. ప్రీ బుకింగ్ రికార్డులు!

ఇక కర్ణాటక, తమిళనాడులో కూడా బాగానే వసూళ్లు రాబట్టింది పుష్ప. బాలీవుడ్ లో పెద్దగా హైప్ క్రియేట్ చేయకుండానే డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అక్కడ ఫస్ట్ డే 3 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అటు యూఎస్ లో ప్రీమియర్స్, డే1 రాబడిని కలుపుకుంటే ఆరున్నర కోట్లకు పైమాటే. ఇలా పుష్ప మేనియాతో అక్కడ, ఇక్కడ అని లేకుండా అన్ని చోట్ల ప్రూవ్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్.