RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. ప్రీ బుకింగ్ రికార్డులు!

ఇండియన్ సినిమాకి యూఎస్ మార్కెట్ చాలా కీలకం. అందునా మన తెలుగు సినిమాకి అమెరికాలో భారీ మార్కెట్ ఉంటుంది. అందుకే మన హీరోలు, దర్శక, నిర్మాతలు అక్కడ ఉన్న మన వాళ్ళని దృష్టిలో..

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. ప్రీ బుకింగ్ రికార్డులు!

Rrr

RRR: ఇండియన్ సినిమాకి యూఎస్ మార్కెట్ చాలా కీలకం. అందునా మన తెలుగు సినిమాకి అమెరికాలో భారీ మార్కెట్ ఉంటుంది. అందుకే మన హీరోలు, దర్శక, నిర్మాతలు అక్కడ ఉన్న మన వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతంతో పోటీగా అమెరికాలో మన సినిమాలు కలెక్షన్లను రాబడతాయి. ఇప్పటికే బాహుబలి సినిమా యూఎస్ మార్కెట్ లో భారీ రికార్డులను నెలకొల్పింది.

Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!

కాగా, ఇప్పుడు రాజమౌళి మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు సమయం ఉండగానే అమెరికాలో ప్రీమియం షోల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తుంది. అమెరికా అంతటా ప్రధాన సినిమా చైన్ లు ముందస్తు బుకింగ్ లను తెరవగా.. ఇప్పటికే అమెరికాలో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను సృష్టిస్తోందని సమాచారం. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ టికెట్స్ ప్రీ సేల్స్ 175K డాలర్ల వద్ద జరిగగా అది కేవలం కొన్ని గంటల్లోనే టార్గెట్ వసూలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

New Film Releases: కొత్త సినిమా వచ్చిందా.. తెలంగాణ వైపు సరిహద్దు ఏపీ ప్రేక్షకులు!

గతంలో అమెరికాలో బాహుబలి 2 సమయంలో టికెట్ ధరలను భారీగా పెంచి క్యాష్ చేసుకోవాలని అక్కడి బయ్యర్లు ప్రయత్నించారు. దీంతో అక్కడి మన ప్రేక్షకుల నుండి భారీ వ్యతిరేకత వచ్చింది. ఒకదశలో ఇండియన్ సినిమాలను బ్యాన్ చేయాలనే వరకు వ్యవహారం రచ్చగా మారింది. అందుకే ఈసారి ఆర్ఆర్ఆర్ నిర్మాతలు డిస్టిబ్యూటర్లతో చర్చించి సాధారణ ధరలతోనే ప్రీమియర్ లను అందుబాటులోకి తెచ్చారు. సాధారణ ధరలతోనే ప్రీమియర్ లను కూడా అందుబాటులోకి తేవడంతో ప్రీ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

2022 Summer Film Releases: సమ్మర్‌లో కూడా హీట్ పెంచేయనున్న స్టార్ హీరోలు!

అమెరికాలో దాదాపుగా వెయ్యి మల్టీఫ్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఒకవిధంగా ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదు. ధరలను కూడా తెలుగు వెర్షన్ సినిమాకు పెద్దలకు 23 డాలర్లు, పిల్లలకు 18 డాలర్లు నిర్ణయించగా.. ఎక్స్ డీ, ఆర్పీఎక్స్, పీఎల్ఎఫ్ స్క్రీన్ వంటి పెద్ద ఫార్మెట్ లో పెద్దలకు 27 డాలర్లు, పిల్లలకు 20 డాలర్లు.. ఐమాక్స్, డీబాక్స్, డాల్బీ సినిమాస్ లో పెద్దలకు 30 డాలర్లు, పిల్లలకు 23 డాలర్లుగా నిర్ణయించారు. దీంతో లాంగ్ రన్ లో ఆర్ఆర్ఆర్ అమెరికాలో సునామీలా వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.