2022 Summer Film Releases: సమ్మర్‌లో కూడా హీట్ పెంచేయనున్న స్టార్ హీరోలు!

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరసగా థియేటర్లలో దిగనున్న స్టార్ హీరోలు మార్చి నెలలో ధియేటర్లకు రిలాక్సేషన్ ఇచ్చి.. మళ్లీ ఎర్లీ సమ్మర్ వచ్చేసరికి దండయాత్రకి సిద్ధమవుతున్నారు.

2022 Summer Film Releases: సమ్మర్‌లో కూడా హీట్ పెంచేయనున్న స్టార్ హీరోలు!

2022 Summer Film Releases

2022 Summer Film Releases: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరసగా థియేటర్లలో దిగనున్న స్టార్ హీరోలు మార్చి నెలలో ధియేటర్లకు రిలాక్సేషన్ ఇచ్చి.. మళ్లీ ఎర్లీ సమ్మర్ వచ్చేసరికి దండయాత్రకి సిద్ధమవుతున్నారు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సమ్మర్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ.. ఏప్రిల్ లో హీట్ ఇంకాస్త పెంచడానికి రెడీ అవుతున్నాయి. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సమ్మర్ లో మరోసారి పెద్ద సినిమాలన్నీధియేటర్ల మీద దండయాత్ర చెయ్యడానికి రెడీఅవుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుదామనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట.. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ ఫస్ట్ ఉగాది రోజు మహేష్-పరశురామ్ కాంబినేషన్లో గ్రాండ్ గా తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది.

Anasuya: ఓ రేంజ్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్!

అసలే.. సమ్మర్ ఆపై ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా రిలీజ్ లతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆడియన్స్ కి.. ఇంకా చెమట్లు పట్టించడానికి సమ్మర్ రిలీజ్ కు రెడీ అయ్యింది కేజీఎఫ్ 2. దాదాపు సంవత్సరం నుంచి రిలీజ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. మాస్ హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 గ్రాడ్ గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్.. మూడునెలలు తిరక్కుండానే మరో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేశారు. 2022లో రాబోతున్న మరో పెద్ద సినిమా హరిహరవీరమల్లు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీగా క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ ఫోక్లోర్ మూవీ ఏప్రిల్ 29న గ్రాండ్ గాప్రేక్షకులముందుకొస్తోంది. పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్న ఈ క్రేజీ మూవీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

2022 Film Releases: ముందుంది అసలైన సినిమా పండగ..!

పాన్ ఇండియా వైడ్ గా ఫాన్స్ వెయిట్ చేస్తున్న మరో పెద్ద మూవీ సలార్. కేజీఎఫ్ తో భారీ సక్సెస్ కొట్టిన ప్రశాంత్ నీల్, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఇద్దరూ కలిసి భారీ కాంబినేషన్లో తెరకెక్కించిన సినిమా సలార్. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ జులై 29 గ్రాండ్ గా ధియేటర్లోకి వస్తోంది. రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యని ప్రభాస్.. నెక్ట్స్ ఇయర్ మాత్రం 3 పెద్ద సినిమాలతో సందడి చేస్తున్నారు. ఒక్కనెల గ్యాప్ లోనే జులైలో సలార్ సినిమా రిలీజ్ చేసి ఆగస్ట్ లో ఆదిపురుష్ లాంటి మరో భారీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఓమ్ రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ రాముడిగా చేస్తున్న ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ 11కి గ్రాండ్ గా రెడీ అవుతోంది.

Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో రాబోతున్న బిగ్గెస్ట్ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్ మూవీ కూడా 2022లోనే రాబోతోంది. పూరీ జగన్ డైరెక్షన్లో కరణ్ జోహార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న లైగర్ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇలా ఆడియన్స్ వెయిట్ చేస్తున్న పెద్ద సినిమాలన్నీ వరసగా 2022లో రిలీజ్ అవుతూ సినిమా జాతరకు రెడీ అవుతున్నాయి.