Anasuya: ఓ రేంజ్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత ట్రోల్స్ చేసినా గ్లామర్ విషయంలో అనసూయ వెనక్కు తగ్గింది లేదు. టీవీ షో కోసమైనా..

Anasuya: ఓ రేంజ్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్!

Anasuya

Anasuya: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత ట్రోల్స్ చేసినా గ్లామర్ విషయంలో అనసూయ వెనక్కు తగ్గింది లేదు. టీవీ షో కోసమైనా.. సిల్వర్ స్క్రీన్ కోసమైనా చిట్టిపొట్టి బట్టలతో చిచ్చు పెట్టడం కామన్. పాత్ర కోసం అవసరమైతే డీగ్లామర్ పాత్రలలో కూడా మెరిసే ఈ యాంకరమ్మ ఈ మధ్య సినిమాల మీద కాస్త కాన్షన్ట్రేషన్ పెంచేసి వరస క్రేజీ ఆఫర్లను కూడా పట్టేస్తుంది. ప్రస్తుతం క్రేజీ సినిమా పుష్పలో దాక్షాయణిగా అదరగొట్టగా మరో రెండు మూడు సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.

2022 Film Releases: ముందుంది అసలైన సినిమా పండగ..!

కాగా.. ఇప్పుడు అనసూయ గ్లామర్ షో అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఇవి పుష్పలో అనసూయ గ్లామర్ ట్రీట్ అంటూ సినిమా విడుదలకు ముందే బయటకొచ్చాయి. కానీ.. పుష్ప సినిమా విడుదల అయ్యాక ఈ ఫోటోలు పుష్పాలో పాత్రవి కాదని అర్ధమైపోయింది. పుష్ప విడుదల తర్వాత మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటోలు అనసూయ నటిస్తున్న మరో సినిమా ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ చిత్రం లోనివి. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఫ్లాష్ బ్యాక్.

Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

ఫ్లాష్ బ్యాక్ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ కూడా ఈ సినిమాలోనివే. ఈ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నెటిజన్లు ఈ సినిమాలో అనసూయ బోల్డ్ అండ్ గ్లామర్ పాత్రలో రెచ్చిపోయి నటించిందని ఫిక్స్ అయిపోతున్నారు. మరి సినిమా విడుదలైతే కానీ తెలియదు ఈ రేంజ్ పాత్రో!