Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

తెలుగు సినిమా ఇప్పుడు స్థాయి పెంచుకుంది. ఒకప్పుడు హిందీ నుండి ఓ స్టార్ హీరో సినిమానో.. లేక తమిళంలో రజినీకాంత్ లాంటి మాస్ హీరోల సినిమా వస్తుంటే దేశమంతా ఎదురుచూసేది.

Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

Pushpa

Pushpa: తెలుగు సినిమా ఇప్పుడు స్థాయి పెంచుకుంది. ఒకప్పుడు హిందీ నుండి ఓ స్టార్ హీరో సినిమానో.. లేక తమిళంలో రజినీకాంత్ లాంటి మాస్ హీరోల సినిమా వస్తుంటే దేశమంతా ఎదురుచూసేది. కానీ.. ఇప్పుడు అంతకు మించి ఓ తెలుగు సినిమా కోసం చూస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు. అందుకు తగ్గట్లే మన మేకర్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెస్తున్నారు. అందుకు తగ్గ ఆదరణ కూడా అలాగే ఉంటుంది. అలా ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చిన సినిమా పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కాగా దర్శకుడు సుకుమార్ తో మూడవ సినిమా ఇదే.

Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

ఈ సినిమా మొదలైన దగ్గర నుండే భారీ అంచనాలు సొంతం చేసుకోగా మేకర్స్ అందుకు తగ్గట్లే నటీనటుల ఎంపిక చేసుకొని ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తూ వచ్చారు. ఈ శుక్రవారం సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా నేరేషన్, లెంత్ విషయంలో కాస్త నెగటివ్ రివ్యూలు వచ్చినా.. సినిమాలో ఉండాల్సిన మెరుపులు, మ్యాజికల్ మూమెంట్స్ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే వాడేసి సెకండ్ హాఫ్ స్లో నేరేషన్ తో ఊపు తగ్గించారని టాక్ వచ్చినా.. సినిమా వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డుల మోత మోగిస్తుంది.

Rajamouli : ఈ సినిమా డైరెక్టర్ నాకంటే పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా : రాజమౌళి

ఇక, పుష్ప గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా చివరికి అల్లు అర్జున్ నటనకి మాత్రం హ్యాట్సాఫ్ అనేస్తున్నారు. సుకుమార్ పుష్ప రాజ్ పాత్రను డిజైన్ చేసిన తీరు దగ్గర నుండి ఆ పాత్ర కోసం బన్నీ తనను తాను మార్చుకొని పాత్రకి ప్రాణం పోసిన తీరుకు సామాన్య ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప పాత్రలో చూపిన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ చూసి శభాష్ అనేస్తున్నారు. ఒక స్టార్ హీరో ఇలా రస్టిక్ పాత్రను ఒప్పుకోడం.. ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టడం చూసిన ప్రేక్షకులు శభాష్ అనేస్తున్నారు.