Rajamouli : ఈ సినిమా డైరెక్టర్ నాకంటే పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా : రాజమౌళి

బాలీవుడ్ సినిమా 'బ్రహ్మస్త్ర' తెలుగులో కూడా రిలీజ్ అవ్వబోతుంది. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లతో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా.........

Rajamouli : ఈ సినిమా డైరెక్టర్ నాకంటే పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా : రాజమౌళి

Rajamouli

Rajamouli :  బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మస్త్ర’ తెలుగులో కూడా రిలీజ్ అవ్వబోతుంది. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లతో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాని ఆయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ తెలుగు మోషన్ పోస్టర్ ని హైదరాబాద్ లో రాజమౌళి లాంచ్ చేశారు.

ఈ సినిమాని దక్షిణాది భాషల్లో డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా మారడంతో సినిమా పై తెలుగులో మంచి హైప్ వచ్చింది. ఇవాళ ఉదయం ఈ మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని సినీ మ్యాక్స్ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ, నాగార్జున, ఆలియా భట్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి సినిమా గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడారు.

Pushpa : సంక్రాంతికి ఓటిటిలో ‘పుష్ప’ ??

రాజమౌళి మాట్లాడుతూ… ‘బ్రహ్మస్త్ర’ మోషన్ పోస్టర్ రిలీజ్‌ ఈవెంట్‌కు నేను వచ్చే వాడ్ని కాదు. ఈ సినిమాని నేను సమర్పించేవాడ్ని కూడా కాదు. కానీ కరణ్ జోహర్ నన్ను ఒప్పించి ఇక్కడిదాకా లాక్కోచ్చారు. ‘బ్రహ్మస్త్ర’ సినిమా తీస్తున్నానని కరణ్ నాకు చెప్పారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ వచ్చి నాకు కథ చెప్పాడు. ఆ కథ విని ఆయన్ నాకంటే పిచ్చోడు అనిపించింది. కానీ ఏడేళ్లుగా బ్రహ్మస్త్ర సినిమాపై పెట్టిన సమయం, హార్డ్ వర్క్ చూసి నాకు నచ్చింది. సినిమాపై పెడుతున్న అతడి అంకితభావం చూసి నాకు అతడి పై గౌరవం పెరిగింది” అని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 9న రిలీజ్ అవ్వనుంది.