New Film Releases: కొత్త సినిమా వచ్చిందా.. తెలంగాణ వైపు సరిహద్దు ఏపీ ప్రేక్షకులు!

సినిమా ఇండస్ట్రీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు దారులుగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత టికెట్ ధరల వివాదం.. బెనిఫిట్ షోల అంశంలో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

New Film Releases: కొత్త సినిమా వచ్చిందా.. తెలంగాణ వైపు సరిహద్దు ఏపీ ప్రేక్షకులు!

New Film Releases

New Film Releases: సినిమా ఇండస్ట్రీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు దారులుగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత టికెట్ ధరల వివాదం.. బెనిఫిట్ షోల అంశంలో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. టికెట్ ధరల అంశంపై తెలంగాణలో ఇప్పటికే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారీ సినిమాలకు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలు పెంచుకున్నాయి. ఏపీలో ఈ మధ్యనే కోర్టు టికెట్ ధరలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. దానిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం కూడా తెలిసిందే.

2022 Summer Film Releases: సమ్మర్‌లో కూడా హీట్ పెంచేయనున్న స్టార్ హీరోలు!

మొత్తంగా ఇప్పుడు ఏదైనా స్టార్ హీరోలకు సంబంధించి కొత్త సినిమా వస్తే తెలంగాణలో బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపుకు అధికారికంగా ఆస్కారం వచ్చేసింది. దీంతో ఈ వారం విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉదయాన్నే బెనిఫిట్ షోలు ప్రదర్శితం కాగా.. టికెట్ ధరల పెంపుతో భారీ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితం జరుగుతుంది. అదే సమయంలో ఏపీలో రోజులు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉండగా.. టికెట్ ధరల పెంపుకు ఆస్కారం లేకపోవడంతో క్రేజ్ ఉన్న ప్రాంతాలలోనే ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేసి మిగతా ప్రాంతాలలో తక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

Samantha: సామ్ క్రేజీ ఫార్ములా.. సినిమాలన్నీ డిఫరెంట్ రోల్సే!

దీంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు పక్క రాష్ట్రాలకు వెళ్లి సినిమాలు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా ముఖ్యంగా తెలంగాణతో సరిహద్దు ప్రాంతాల ఏపీ ప్రేక్షకులు ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి వచ్చి సినిమా చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అటు, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల ప్రేక్షకులు కూడా కొందరు ఆయా రాష్ట్రాల థియేటర్లకే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. సహజంగానే ఏపీ ప్రజలు ఎక్కువగా ఉండే తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో థియేటర్లలో తెలుగు సినిమాలను కూడా ఎక్కువగానే విడుదల చేస్తారు.

Anasuya: ఓ రేంజ్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్!

దీంతో ఆయా ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఏపీ ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల సమయంలో బెనిఫిట్ షోల కోసం ఎక్కువగా రాష్ట్ర సరిహద్దులు దాటేసి సినిమాలు చూసేందుకు మొగ్గుచూపుతున్నారట. ఒకవిధంగా ఇది థియేటర్ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టమే. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని పక్క రాష్ట్రాలకు చెల్లించేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం దోపిడీని అరికట్టేందుకు సదుద్దేశ్యంతోనే బెనిఫిట్ షోలను రద్దు చేసినా.. టికెట్ ధరల పెంపుకు నిరాకరించినా ఒకవిధంగా ట్యాక్స్ రూపంలో ఆదాయానికి గడిపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.