Acharya : కాజల్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం పేరు కూడా పలకట్లేదు?

ఆచార్య సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే నటించారు. అయితే ఇప్పుడు అందరి మదిలో ఉన్నది ఒకటే ప్రశ్న. ఆచార్య టీం కాజల్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం......

Acharya : కాజల్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం పేరు కూడా పలకట్లేదు?

Kajal

 

Kajal Aggarwal :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే నటించారు. అయితే ఇప్పుడు అందరి మదిలో ఉన్నది ఒకటే ప్రశ్న. ఆచార్య టీం కాజల్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం ఆమె పేరు కూడా ఎందుకు ఎత్తట్లేదు అని.

ఆచార్య సినిమాలో కాజల్ పూర్తి స్థాయి పాత్రలో నటించిందని సమాచారం. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు కాజల్ తన భర్తతో సెట్ కి వస్తే వారిద్దర్నీ చిరంజీవి, చిత్ర యూనిట్ సన్మానించారు కూడా. రెండేండ్ల క్రితం గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకున్న కాజ‌ల్ ఇటీవలే ఓ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా, బాబు పుట్టిన కారణంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకి దూరంగా ఉంది అని భావించొచ్చు.

Srinidhi Shetty : ఏ భాషలో నటించడానికైనా రెడీ.. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..

కానీ కాజల్ రాకపోయినా చిత్ర యూనిట్ మాత్రం కాజల్ పేరు అసలు ఎక్కడా ప్రస్తావించట్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, చరణ్, కొరటాల.. ఇలా చిత్ర యూనిట్ కి సంబంధించిన ఎవరూ కూడా కాజల్ పేరు పలకకపోవడం, కనీసం ఆమెకి థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం గమనార్హం. అంతే కాక ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలలో కూడా కాజల్ పేరు తీసుకురావట్లేదు. ఇవన్నీ ఒకెత్తయితే టీజర్, ట్రైలర్ లలో కూడా కాజల్ ని అసలు చూపించలేదు. కాజల్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అని చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం ఒక సెకండ్ కూడా ప్రచార వీడియోలలో చూపించలేదు.

Ram Charan : ‘ఆచార్య’లో నేను ఉన్నానని నాకే తెలీదు..

దీంతో కాజల్ అభిమానుల్లో, ప్రేక్షకులలో కొత్త డౌట్స్ తలెత్తుతున్నాయి. అసలు సినిమాలో కాజల్ ఉందా లేక ఎడిటింగ్ లో తీసేశారా?, కాజల్ ని కావాలనే పక్కన పెడుతున్నారు, కావాలనే ఆమె గురించి మాట్లాడట్లేదు అని కాజల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి కాజల్ ఎంతవరకు ఈ సినిమాలో ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.