Abbas : అమ్మాయి వదిలేసింది.. సూసైడ్ ప్రయత్నం.. సినిమాలు మానేశా.. ట్యాక్సీ డ్రైవర్‌గా..
అబ్బాస్ అంటే ఇట్టే గుర్తు పట్టకపోవచ్చు కానీ ప్రేమ దేశం అబ్బాస్ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అయిన అబ్బాస్ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగాడు.
Actor Abbas : అబ్బాస్ అంటే ఇట్టే గుర్తు పట్టకపోవచ్చు కానీ ప్రేమ దేశం అబ్బాస్ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అయిన అబ్బాస్ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగాడు. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. అయితే ఎందుకనో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. కుటుంబాన్ని పోషించలేక ఒకానొక సమయంలో ట్యాక్సీ డ్రైవర్‌గా, పెట్రోల్ బంక్‌లో సైతం పని చేశాడు. తాజాగా అసలు తాను సినీ పరిశ్రమకు ఎందుకు దూరం అయ్యాను అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సోషల్ మీడియాకు తాను చాలా దూరంగా ఉంటానని అబ్బాస్ చెప్పాడు. ఇక తాను పదో తరగతి ఫెయిల్ అయినట్లు తెలిపాడు. అదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం కావడంతో జీవితం పై విరక్తి కలిగిందని, దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. ‘ఈ క్రమంలో ఓ సారి రోడ్డు పక్కన నిలుచుకుని వేగంగా వస్తున్న ఓ వాహనం ముందుకు వెళ్లాలని అనుకున్నా. అయితే.. అప్పుడు ఆ వాహన డ్రైవర్ గురించి ఆలోచించి ఆగిపోయా. ఎందుకంటే నా వల్ల అతడు ఇబ్బందులు పడతాడని బావించా. కష్ట సమయాల్లో ఇతరుల శ్రేయస్సును కోరుకునే మనసత్వాన్ని అలవరచుకున్నా. ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నట్లు’ అబ్బాస్ వెల్లడించాడు.
కరోనా సమయంలో జూమ్ కాల్ ద్వారా అభిమానులకు దగ్గర అయినట్లు తెలిపాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో మార్పు తెచ్చేందుకు తన వంతు సహకారం అందించినట్లు చెప్పాడు. తాను అనుకోకుండానే నటుడిని అయ్యానని, మొదటి సినిమా కాదల్ దేశం (ప్రేమ దేశం) సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినిమా విడుదలైన మరుసటి రోజు మా ఇంటి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులను చూసి ఆశ్చర్యపోయా. వారెందుకు నాపై అంతలా ప్రేమను చూపించారో ఆ సమయంలో నాకు అర్థం కాలేదన్నారు.
కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు చూసినప్పటికి తరువాత పరాజయాలు వెక్కిరించాయి. ఒకనొక సమయంలో చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేందుకు సైతం డబ్బులు లేవు. ఆ సమయంలో అవకాశం కోసం నిర్మాత ఆర్.బి. చౌదరిని కలిశాను. ఆయన పూవెలి చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు నటన పై ఆసక్తి పోయింది. అందుకే సినిమాలకు దూరం అయినట్లు అబ్బాస్ చెప్పాడు.
ఇక సినిమాలకు దూరం అయిన తరువాత న్యూజిలాండ్ వెళ్లిపోయానట్లు చెప్పాడు. కుటుంబాన్ని పోషించేందుకు బైక్ మెకానిక్‌గా , ట్యాక్సీ డ్రైవర్ వంటి పనులను చేసినట్లు తెలిపాడు. ఇటీవలే ఇండియాకు వచ్చిన అబ్బాస్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. చూడాలి మరీ అబ్బాస్ ఎవరైనా ఛాన్స్ ఇస్తారో లేదో.