Bigg Boss 7 : బిగ్‌బాస్ 7లో కంటెస్టెంట్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌.. తెలుగు ఆట‌గాడే.. నిజ‌మెంత‌..?

ఎక్కడో విదేశాల్లో పుట్టిన రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss). మ‌న దేశంలో తొలుత హిందీ భాష‌లో ప్రారంభ‌మైంది. ఆ త‌రువాత క్ర‌మంగా అన్ని బాష‌ల్లోనూ స‌క్సెస్ పుల్‌గా దూసుకుపోతుంది.

Bigg Boss 7 : బిగ్‌బాస్ 7లో కంటెస్టెంట్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌.. తెలుగు ఆట‌గాడే.. నిజ‌మెంత‌..?

Venugopal Rao in Bigg Boss Telugu 7

Venugopal Rao in Bigg Boss 7 : ఎక్కడో విదేశాల్లో పుట్టిన రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss). మ‌న దేశంలో తొలుత హిందీ భాష‌లో ప్రారంభ‌మైంది. ఆ త‌రువాత క్ర‌మంగా అన్ని బాష‌ల్లోనూ స‌క్సెస్ పుల్‌గా దూసుకుపోతుంది. ఇక మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా ఆరు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే 7వ‌ సీజ‌న్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు.

మొద‌టి సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రెండో సీజ‌న్‌కు నాని హోస్ట్‌గా చేయ‌గా మిగిలిన సీజ‌న్ల‌కు నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఏడో సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున నే హోస్ట్‌గా చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఓ భార‌త మాజీ క్రికెట‌ర్ అడుగుపెట్ట‌బోతున్నాడ‌ట‌. అత‌డు మ‌రెవ‌రో కాదు ఆంధ్రప్ర‌దేశ్ కు చెందిన వై.వేణుగోపాల రావు.

Vishnu Vishal : క‌మెడియ‌న్‌తో వివాదం.. స్పందించిన హీరో.. రూ.2.7 కోట్లు తిరిగి ఇవ్వ‌లేనా..?

అత‌డిని షోకి తీసుకువ‌చ్చేందుకు బిగ్‌బాస్ బృందం గ‌ట్టి ప్ర‌యత్నాలే చేస్తుంద‌ని ఆ వార్త‌ల సారాంశం. దీనిపై ఇంత వ‌ర‌కు అటు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు గానీ, ఇటు వేణుగోపాల రావు గానీ స్పందించ‌లేదు. మ‌రీ ఇందులో ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. ఇక ఏడో సీజ‌న్‌ను ఆగ‌స్టు నెల చివ‌రి వారంలో ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాలు బిగ్‌బాస్ బృందం స‌న్నాహ‌కాలు చేస్తోంది.

Venugopal Rao

Venugopal Rao

Hidimbha Reverse Action Trailer : ఇదేం ట్రైల‌ర్ రా బాబు.. అంతా రివ‌ర్సే.. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన‌ హిడింబ రివ‌ర్స్ యాక్ష‌న్ ట్రైల‌ర్‌

టీమ్ఇండియాకు ఆడిన అతి కొద్ది మంది తెలుగు క్రికెట‌ర్ల‌లో వేణుగోపాల రావు ఒక‌రు. భార‌త్ త‌రుపున చాలా త‌క్కువ మ్యాచులే ఆడాడు. 16 వ‌న్లేల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 218 ప‌రుగులు చేశాడు. ఒకే ఒక అర్థ‌శ‌త‌కం అత‌డి పేరిట ఉంది. అది కూడా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ పైనే చేశాడు. అత్య‌ధిక స్కోరు 61 నాటౌట్‌. ఇక ఐపీఎల్‌లో దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ త‌రుపున మొత్తం 65 మ్యాచులు ఆడి మూడు అర్థ‌శ‌త‌కాల సాయంతో 985 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 71 నాటౌట్‌.