Sathyaraj : ‘కట్టప్ప’కి కరోనా.. ఆస్పత్రిలో చేరిక

తమిళ సీనియర్ నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు.

Sathyaraj : ‘కట్టప్ప’కి కరోనా.. ఆస్పత్రిలో చేరిక

Kattappa

Sathyaraj :  ఇటీవల రోజు రోజుకి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఈ సారి మళ్ళీ చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో కూడా ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, విష్వక్సేన్, మహేష్ బాబు, నితిన్ వైఫ్, థమన్… ఇలా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తమిళ్ లో కూడా కమల్ హాసన్, విక్రమ్, కమెడియన్ వడివేలు, వరలక్ష్మి శరత్ కుమార్.. ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ‘బాహుబలి’ సినిమాలో కట్టప్పగా మనందరినీ మెప్పించిన సత్యరాజ్ కరోనా బారిన పడ్డారు.

Anup Rubens : ‘బంగార్రాజు’ సినిమా కోసం రోజుకి 20 గంటలు పని చేశాం

తమిళ సీనియర్ నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక తమిళనాడులో కూడా రోజు రోజుకి కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అంతే కాక రేపు ఆదివారం లాక్‌డౌన్‌ను కూడా విధించారు. కరోనా కేసుల తీవ్రతను బట్టి తమిళనాడు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.