Anup Rubens : ‘బంగార్రాజు’ సినిమా కోసం రోజుకి 20 గంటలు పని చేశాం

ప్రమోషన్స్ లో భాగంగా 'బంగార్రాజు' మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనూప్ రూబెన్స్ సినిమా గురించి మాట్లాడుతూ..........

Anup Rubens : ‘బంగార్రాజు’ సినిమా కోసం రోజుకి 20 గంటలు పని చేశాం

Bangarraju

Anup Rubens :   కరోనా కారణంగా, ఏపీలో సినిమా టికెట్ల ధరల సమస్య కారణంగా పెద్ద సినిమాలన్ని వాయిదా పడ్డాయి. దీంతో ఒక్క సారిగా చిన్న సినిమాలన్ని సంక్రాంతికి రానున్నాయి. పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటంతో నాగార్జున ఇదే మంచి టైం అనుకోని తన ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతికి అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని సంక్రాంతికి అనౌన్స్ చేసే టైంకి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగం పెంచారు. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే మరో పక్క ప్రమోషన్స్ చేస్తుంది సినిమా యూనిట్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ‘బంగార్రాజు’ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనూప్ రూబెన్స్ సినిమా గురించి మాట్లాడుతూ…. ‘బంగార్రాజు’ లాంటి పెద్ద సినిమాకి చాలా సమయం పడుతుంది. కానీ ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయాలని నాతోపాటు సాంకేతిక నిపుణులందరూ చాలా వేగంగా పని చేశారు. రీ రికార్డింగ్‌ కోసం రోజుకు 20 గంటలు పని చేశాం. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘బంగార్రాజు’ పాటలతో ఆ సినిమా పాటలకు ఆడియన్స్ కచ్చితంగా పోలికలు పెడతారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో మనకు ఓ బెంచ్‌ మార్క్‌ ఉంది. దాన్ని ‘బంగార్రాజు’తో రీచ్‌ అవ్వాలి అని నాగ్‌ సార్‌ అన్నారు. అందుకే ప్రేక్షకుల అంచనాలు అందుకునేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించి సంగీతం ఇచ్చాను. ‘బంగార్రాజు’ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఒక్క పాట కూడా వెస్ట్రన్‌ టైప్‌లో ఉండదు. అన్నీ కూడా ట్రెడిషనల్‌గా, పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి” అని తెలిపారు.

Tamil Heros : ఓటీటీ బాట పడుతున్న తమిళ స్టార్ హీరోలు

”ఈ సినిమా కోసం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చాలా కష్టపడ్డారు. ఎక్కడా టెన్షన్‌ పడకుండా ఓ టార్గెట్‌ పెట్టుకుని ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైన పని. క్వాలిటీ, మ్యూజిక్, ఎడిటింగ్, సీజీ వర్క్‌.. ఇలా ఎక్కడా కూడా రాజీ పడలేదు. ‘బంగార్రాజు’లో ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. అది నాకు చాలా సంతోషాన్నిస్తుంది” అని అన్నారు.