Adbhutham : ‘జాంబిరెడ్డి’తో రాజశేఖర్ పెద్ద కూతురు హీరోయిన్ గా ‘అద్భుతం’ .. ఓటిటిలో

హీరోగా 'జాంబీ రెడ్డి', 'ఇష్క్' సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతం 'అద్బుతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తేజ. ఈ సినిమాతో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా పరిచయమవుతుంద

Adbhutham : ‘జాంబిరెడ్డి’తో రాజశేఖర్ పెద్ద కూతురు హీరోయిన్ గా ‘అద్భుతం’ .. ఓటిటిలో

Adbhutham

Adbhutham :  బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన తేజ సజ్జా ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. బాలనటుడిగా గ్యాప్ తీసుకొని తర్వాత సమంత లీడ్ రోల్ లో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ‘జాంబీ రెడ్డి’, ‘ఇష్క్’ సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతం ‘అద్బుతం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తేజ.

Bigg Boss 5 : నాకు మానస్ కి ఇవ్వాలని ఉంది.. కేక్ ముక్క కోసం కంటెస్టెంట్స్

ఈ సినిమాతో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా పరిచయమవుతుంది. గతంలో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా ‘దొరసాని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ప్రస్తుతం కొన్ని సివినిమాల్లో నటిస్తుంది. ‘అద్భుతం’ సినిమాతో శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Jai Bheem : 25 రోజుల్లో ‘జై భీమ్’ కోర్ట్ సెట్.. ఆశ్చర్యపోయిన తమిళనాడు హైకోర్ట్ సిబ్బంది

టైం కాన్సెప్ట్ తో ఓ డిఫరెంట్ స్టోరీ కి ప్రేమ కథని జోడించి ‘అద్భుతం’ సినిమాగా తీసుకురాబోతున్నారు. ఇద్దరు వ్యక్తులకి ఒకే ఫోన్ నెంబర్, ఒకే ప్లేస్ లో ఉంటూ వివిధ టైంలైన్స్ లో ఉండే కథతో నిర్మితమవుతుంది ఈ సినిమా. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో ‘ప్లే బ్యాక్’ అనే సినిమా వచ్చింది. కాని ఆ సినిమాకి ఈ సినిమాకి జోనర్ మాత్రమే సేమ్ మిగిలినదంతా డిఫరెంట్ అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ‘అద్భుతం’ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులని స్టార్ మా ఛానల్ దక్కించుకుంది.

NANI : ఇకపై స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చేయను.. కాని : నాని

తేజ హీరోగా నిలదొక్కుకోడానికి బాగానే ప్రయత్నిస్తున్నాడు. ‘అద్భుతం’ సినిమాతో మరోసారి మెప్పించి హిట్ కొడతాడేమో చూడాలి. ఇక రాజశేఖర్ పెద్ద హీరోయిన్ శివాని ఈ సినిమాతో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందో చూడాలి.