Jai Bheem : 25 రోజుల్లో ‘జై భీమ్’ కోర్ట్ సెట్.. ఆశ్చర్యపోయిన తమిళనాడు హైకోర్ట్ సిబ్బంది

జస్టిస్‌ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని అధిక భాగం కోర్టు సన్నివేశాలతోనే నడుస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ సీన్లు కోర్టులోనే తీశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మద్రాసు

Jai Bheem : 25 రోజుల్లో ‘జై భీమ్’ కోర్ట్ సెట్.. ఆశ్చర్యపోయిన తమిళనాడు హైకోర్ట్ సిబ్బంది

High Court

Jai Bheem :  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జై భీమ్ సినిమా గురించే చర్చ నడుస్తుంది. జస్టిస్ చంద్రు అనే ఓ లాయర్ జీవిత చరిత్రని, ఆయన డీల్ చేసిన ఓ గిరిజన యువకుడి హత్య కేసుని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. సూర్య హీరోగా జస్టిస్ చంద్రు పాత్రలో అద్భుతమైన నటనని అందించారు. ఓటిటిలో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ముఖ్యంగా సూర్య, లిజోమోల్, మణికంఠన్‌ల నటనని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.

NANI : ఇకపై స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చేయను.. కాని : నాని

జస్టిస్‌ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని అధిక భాగం కోర్టు సన్నివేశాలతోనే నడుస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ సీన్లు కోర్టులోనే తీశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మద్రాసు హైకోర్టు సెట్ వేశారు. ఈ కథ 1995లో జరగడంతో అప్పటి తమిళనాడు హైకోర్ట్ ని రీక్రియేట్‌ చేశారు చిత్ర బృందం. ప్రొడక్షన్‌ డిజైనర్‌ కె.కదిర్‌, సినిమాట్రోగ్రాఫర్‌ ఎస్‌.ఆర్‌.కదిర్‌, దర్శకుడు జ్ఞానవేల్‌ కలిసి ఈ సెట్ ని అచ్చు గుద్దినట్టు అప్పటి హైకోర్ట్ లా తీర్చిదిద్దారు. సెట్‌ వేసే సమయంలో జస్టిస్‌ చంద్రు సలహాలు కూడా తీసుకున్నారు.

Poonam Pandey : పూనమ్ పాండేను తీవ్రంగా కొట్టిన భర్త.. హాస్పిటల్లో పూనమ్

అయితే ఈ సెట్ ని కేవలం 25 రోజుల్లోనే నిర్మించారు. 25 రోజుల్లోనే హై కోర్ట్ సెట్ ని తీర్చిదిద్దడం చూసి గత కొన్నేళ్లుగా మద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. హైకోర్ట్ సిబ్బంది, న్యాయవాదులు ఈ సినిమా చూసి ఇందులో కోర్ట్ గురించి అభినందిస్తున్నారు. చాలా తక్కువ టైంలో ఇంత పర్ఫెక్ట్ గా సెట్ వేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ కోర్ట్ సెట్ మేకింగ్ కి సంబంధించిన వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.