Adivi Sesh : బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లో కూడా ‘మేజర్’ టాప్ 1 పొజిషన్..

అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్‌’. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి..................

Adivi Sesh : బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లో కూడా ‘మేజర్’ టాప్ 1 పొజిషన్..

Major

Major :  అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్‌’. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించి కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. మహేష్ బాబు కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా మేజర్ సినిమా జులై 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిష‌న్ల‌లో మేజ‌ర్ ఉండటం విశేషం. ‘మేజర్‌’ హిందీ వెర్షన్‌ టాప్‌ 1లో ట్రెండ్‌ లో ఉండగా, తెలుగు వెర్షన్‌ రెండో స్థానంలో ఉంది. ఇక ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కూడా మేజర్ సినిమా టాప్ 1లో ఉండటం విశేషం. ఆ దేశాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్‌ మొదటి స్థానంలో ఉంది.

Amala Paul : రెండో పెళ్లిపై స్పందించిన అమలాపాల్..

 

ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ షేర్ చేయగా అడివి శేష్ అధికారికంగా పోస్ట్ చేశారు. ఇలా ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా మేజర్ సినిమా టాప్ 1లో ఉండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.