Amala Paul : రెండో పెళ్లిపై స్పందించిన అమలాపాల్..

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన అమలాపాల్‌ తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. ఓ నెటిజన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి అని అడగగా అమలాపాల్ దీనికి సమాధానమిస్తూ............

Amala Paul : రెండో పెళ్లిపై స్పందించిన అమలాపాల్..

Amala Paul

Updated On : July 9, 2022 / 6:56 AM IST

Amala Paul :  ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇక ఓటీటీలోకి కూడా అడుగుపెట్టి తెలుగు, తమిళ్ లో వెబ్ సిరీస్ లు చేస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తమిళ డైరెక్టర్‌ విజయ్‌ను పెళ్లాడింది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పటిదాకా మళ్ళీ తన పెళ్లిపై మాట్లాడలేదు అమలాపాల్.

Nikki Tamboli : నేను ఏడ్చినా, నవ్వినా ట్రోల్ చేస్తారు.. వాళ్లకి పనేం లేదు..

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన అమలాపాల్‌ తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. ఓ నెటిజన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి అని అడగగా అమలాపాల్ దీనికి సమాధానమిస్తూ.. ”ఇప్పట్లో నేను ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ప్రస్తుతం నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకునే పనిలో ఉన్నాను. నన్ను నేను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నాను. నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్‌ ఉండాలో ఇప్పుడైతే చెప్పలేను” అని తెలిపింది. ఈ లెక్కన అమలాపాల్ ఇప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనట్టే తెలుస్తుంది.