Adivi Sesh : పెళ్లి పనులు మొదలు పెట్టిన అడివి శేష్.. జనవరి 26న పెళ్లి..

అడివి శేష్ నటించి రీసెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించింది. 'మేజర్' వంటి సినిమాతో ఇతర ఇండస్ట్రీలో కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక గత ఏడాది అంతా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న అడివి శేష్ ఇప్పుడు పెళ్లి పనులతో బిజీ కాబోతున్నాడు.

Adivi Sesh : పెళ్లి పనులు మొదలు పెట్టిన అడివి శేష్.. జనవరి 26న పెళ్లి..

adivisesh

Adivi Sesh : గత ఏడాది అంతా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న అడివి శేష్ ఇప్పుడు పెళ్లి పనులతో బిజీ కాబోతున్నాడు. ఈ హీరో నటించి రీసెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించింది. ‘మేజర్’ వంటి సినిమాతో ఇతర ఇండస్ట్రీలో కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తన సూపర్ హిట్ చిత్రం గూఢచారికి సీక్వెల్ తీసుకు వచ్చే పనిలో పడ్డాడు. గత కొంత కాలంగా స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే పట్టాలు ఎక్కింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రాబోతుంది.

Goodachari 2 : ప్రీ విజన్ వీడియో సిద్ధం చేస్తున్న అడివి శేషు.. గూఢచారి-2 అప్డేట్!

ఇక విషయానికి వస్తే అడివి శేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అయితే ఈ వివాహం అడివి శేష్‌ది కాదండోయ్, అతని సోదరిది. అతని సిస్టర్ షిర్లే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ‘డేవిన్‌ గుడ్‌రిచ్‌’ అనే అమెరికన్ వ్యక్తితో కలిసి శేష్ సోదరి ఏడు అడుగులు వేయబోతుంది. దీంతో అన్నగా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు శేష్. ఈ నెల 26న ఈ వివాహ వేడుక జరగనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత బంధుమిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. వరుడు డేవిన్‌ గుడ్‌రిచ్‌ కుటుంబసభ్యులు ఫ్లోరిడా నుంచి ఈ వివాహానికి రానున్నారు.

కాగా నిన్న మెహందీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ ఫోటోలను అడివి శేష్ షేర్ చేస్తూ.. ‘మెహందీ అంటూ రాజస్థాన్ థీమ్ ట్రై చేసాము. కానీ పెళ్లి మాత్రం తెలుగు సాంప్రదాయ పద్దతిలోనే ఉంటుంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ ఫొటోల్లో టాలీవుడ్ స్టార్ కామెడియన్ వెన్నెల కిశోర్‌ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)