Goodachari 2 : ప్రీ విజన్ వీడియో సిద్ధం చేస్తున్న అడివి శేషు.. గూఢచారి-2 అప్డేట్!

టాలీవుడ్ హీరో అడివి శేషు వరుస హిట్టులు అందుకుంటూ ఫుల్ ఫార్మ్‌లో ఉన్నాడు. కాగా 2018‌లో వచ్చిన గూఢచారి సినిమా అడివి శేషుని హీరోగా నిలదొక్కుకునేలా చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ఎప్పుడో ప్రకటించిన అడివి శేషు.. ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

Goodachari 2 : ప్రీ విజన్ వీడియో సిద్ధం చేస్తున్న అడివి శేషు.. గూఢచారి-2 అప్డేట్!

Goodachari 2 update out now

Goodachari 2 : టాలీవుడ్ హీరో అడివి శేషు వరుస హిట్టులు అందుకుంటూ ఫుల్ ఫార్మ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ‘మేజర్’, ‘హిట్-2’ సినిమాలతో విజయం అందుకున్న అడివి శేషు తన తదుపరి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అందులో ఒకటి గూఢచారి-2. ఈ సీక్వెల్ కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2018‌లో వచ్చిన గూఢచారి సినిమా అడివి శేషుని హీరోగా నిలదొక్కుకునేలా చేసింది.

Adivi Sesh : అడవిశేష్ 350 కోట్లు సంపాదించాడా?? తన రెమ్యునరేషన్ పై శేష్ క్లారిటీ..

ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి అడివి శేషునే కథని, స్క్రీన్ ప్లేని అందించాడు. శశి కిరణ్ టిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శోభిత ధూళిపాళ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ప్రధాన పత్రాలు పోషించారు. కాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ఎప్పుడో ప్రకటించిన అడివి శేషు.. ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఒక ప్రీ విజన్ వీడియోని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అడివి శేషు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయితే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో గూఢచారి-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వీడియో లాంచ్ ని జనవరి 9న ముంబై అండ్ ఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలియజేశాడు. కాగా ఈ సినిమాని గూఢచారి-1కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వినయ్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి ఈ ప్రీ విజన్ వీడియో ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.