Adivi Sesh : అడవిశేష్ 350 కోట్లు సంపాదించాడా?? తన రెమ్యునరేషన్ పై శేష్ క్లారిటీ..
తాజాగా హిట్ 2 సక్సెస్ అవ్వడంతో ట్విట్టర్ లో అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించాడు శేష్. వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ గూగుల్ లో మీ రెమ్యునరేషన్ అని కొడితే.............

Adivi Sesh remuneration for a movie
Adivi Sesh : ప్రస్తుత యువ హీరోల్లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో అడివి శేష్. వరుస సినిమాలతో, మంచి కంటెంట్ తో జనాల్ని మెప్పిస్తూ హిట్స్ కొడుతున్నాడు. వరుసగా ఆరు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు అడివి శేష్. ఇటీవలే హిట్ 2 సినిమాతో మరో హిట్ కొట్టాడు శేష్.
తాజాగా హిట్ 2 సక్సెస్ అవ్వడంతో ట్విట్టర్ లో అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించాడు శేష్. వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ గూగుల్ లో మీ రెమ్యునరేషన్ అని కొడితే సినిమాకి 5 కోట్లు, ఇప్పటికే 359 కోట్లు(450 మిలియన్ డాలర్స్) సంపాదించారు అని చూపిస్తుంది. ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను అని ట్వీట్ చేశాడు.
Harish Shankar : సారీ.. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం.. హరీష్ శంకర్ వ్యాఖ్యలు..
దీనికి అడివి శేష్ సమాధానమిస్తూ.. ఆ 450 మిలియన్ డాలర్స్ ఎక్కడున్నాయో చెప్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని తెలిపాడు. ఇలా సెటైరికల్ గా సమాధానం చెప్పినా తన రెమ్యునరేషన్ గురించి మాత్రం చెప్పలేదు. గూగుల్ లో చూపించినట్టు సినిమాకి 5 కోట్లు మాత్రం తీసుకోవట్లేదని అర్ధమవుతుంది. దీంతో మరోసారి అడివి శేష్ రెమ్యునరేషన్ గురించి చర్చించుకుంటున్నారు అంతా.
Maaku kooda aa $450M ekkadundho chepthe break ivvadaaniki ready ga unnaam. ? https://t.co/27YvTzR1yx
— Adivi Sesh (@AdiviSesh) December 7, 2022