Harish Shankar : సారీ.. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం.. హరీష్ శంకర్ వ్యాఖ్యలు..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇందులో అందరూ తెలుగమ్మాయిలు నటించారు అని చెప్తూ ఉంటే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఒక రచయితగా నా సినిమాలలో తెలుగు వాళ్ళని పెట్టుకోవడానికి ఇష్టపడతాను. వేరే భాష వాళ్ళు అయితే సీన్స్, డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి..........

Harish Shankar : సారీ.. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం.. హరీష్ శంకర్ వ్యాఖ్యలు..

harish shankar comments on telugu heroines

Harish Shankar :  సాధారణంగా మన తెలుగులో వేరే భాష అమ్మాయిలకే హీరోయిన్స్ గా అవకాశాలు వస్తాయి. కన్నడ, మలయాళం, బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని తెచ్చుకుంటారు. ఎప్పట్నుంచో ఇదే జరుగుతుంది. ఇక్కడ స్టార్స్ గా ఎదిగిన వాళ్లంతా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వరు అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా దీనిపై జీవిత రాజశేఖర్, హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు.

బ్రహ్మానందం, స్వాతి, శివాత్మిక.. పలువురు మెయిన్ లీడ్స్ లో నటించి ఆంథాలజీ సినిమాగా తెరకెక్కిన పంచతంత్రం డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు జరగగా జీవితా, హరీష్ శంకర్ లు ముఖ్య అతిధులుగా వచ్చారు.

ఈ ఈవెంట్ లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి స్థానం దక్కట్లేదు. ఈ సినిమాలో నటించింది అందరూ తెలుగు అమ్మాయిలే. దీంట్లో ఈ సినిమా వాళ్ళని మెచ్చుకోవాలి. హరీష్ శంకర్ గారికి నా విన్నపం కుదిరితే పెద్ద సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వండి అని చెప్పింది.

Manchu Lakshmi : శ్రీకాకుళంలో మంచు లక్ష్మి.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇందులో అందరూ తెలుగమ్మాయిలు నటించారు అని చెప్తూ ఉంటే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఒక రచయితగా నా సినిమాలలో తెలుగు వాళ్ళని పెట్టుకోవడానికి ఇష్టపడతాను. వేరే భాష వాళ్ళు అయితే సీన్స్, డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. కానీ మార్కెట్ ఈక్వేషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇలాంటి కొన్నిటి వల్ల తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాము. ఈ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. ఎక్కడో తెలుగు అమ్మాయిలకి న్యాయం జరగట్లేదు. నా వరకు ప్రయత్నిస్తాను. కానీ సినిమా బిజినెస్ ల వల్ల అంత తొందరగా తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావట్లేదు. ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను అని అన్నారు. దీంతో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారాయి.