Manchu Lakshmi : శ్రీకాకుళంలో మంచు లక్ష్మి.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’

నటి మంచు లక్ష్మి ఓ పక్కన సినిమాలు మరో పక్కన యాంకర్ గా చేస్తూనే 'టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌' అనే ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు...............

Manchu Lakshmi : శ్రీకాకుళంలో మంచు లక్ష్మి.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’

manchu lakshmi at srikakulam

Manchu Lakshmi :  నటి మంచు లక్ష్మి ఓ పక్కన సినిమాలు మరో పక్కన యాంకర్ గా చేస్తూనే ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది పిల్లలకి విద్య పరంగా సపోర్ట్ చేస్తుంది మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ లో భాగంగా శ్రీకాకుళం వెళ్లారు. మొదట అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

Flora Saini : శ్రద్ధా వాకర్ పరిస్థితే నాకు కూడా వచ్చేదేమో.. బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

అనంతరం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామంలో నుంచి ప్రజలకి అభివాదం చేస్తూ వెళ్లారు. అక్కడి స్కూల్ లో దాదాపు మూడు లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. మా ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ ఎన్జీవో తరపున ఇప్పటికే దాదాపు 475 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నాము. దీని ద్వారా విద్యార్థులకు ఇంగ్లీష్, కంప్యూటర్ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నాము. ఇక్కడి పాఠశాలలో కూడా స్మార్ట్ క్లాస్ రూమ్ ని ప్రారంభించేందుకు వచ్చాను అని తెలిపింది. ఇక తమ గ్రామానికి మంచు లక్ష్మి వచ్చిందని తెలియడంతో గ్రామస్థులు ఆమెని చూడటానికి ఎగబడ్డారు.