Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ లో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాల ఎంపిక విషయంలో నైపుణ్యంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన..

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

Aha Ott

Aha OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ లో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాల ఎంపిక విషయంలో నైపుణ్యంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటి వరకు కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే ఉన్న అల్లు అరవింద్ మొట్టమొదటిసారి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అహాతో డిజిటల్ రంగప్రవేశం చేసి మెల్ల మెల్లగా దాన్ని మెగా హిట్ చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాతోనే ఆహా తమిళం కూడా మొదలు పెట్టారు.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

ఇంతకు ముందు నేషనల్ ఓటీటీలు ఎన్నింటినో ఆదరించిన తెలుగు ప్రేక్షకులు తొలి మాతృబాష ఓటీటీ ఆహాను ఊహించని స్థాయిలో ఆదరించారు. సిరీస్ ల నుండి షోల వరకు.. ఒరిజినల్స్ నుండి మూవీస్ వరకు అన్నిటిలో ఆహా అనిపించింది. ఇకపై కూడా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు వినోదాన్ని అందించేందుకు ఆహా యాజమాన్యం సంపూర్ణ సిద్ధంగా ఉంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆహా ఇప్పుడు ఇతర సౌత్ అన్ని బాషలలో విస్తరించేందుకు సిద్ధమైంది.

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

ముందుగా తెలుగు ఓటీటీ ఆహాను తమిళంలో కూడా లాంచ్ చేశారు. శుక్రవారం చెన్నైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన తమిళ ఆహా ఓటీటీ లాంచింగ్ కార్యక్రమానికి ఆర్‌.బి.చౌదరి, కలైపులి ఎస్‌.థాను, దర్శకుడు కె ఎస్‌ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌ దంపతులు, నటుడు ఎస్‌.జె.సూర్య, ఖుష్భు, కె.భాగ్యరాజ్, పా.రంజిత్, నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు శివ హాజరయ్యారు. అల్లు అరవింద్‌ను నిర్మాత కలైపులి ఎస్‌.థాను సత్కరించగా.. నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఆహా లోగోను ఆవిష్కరించారు.

Kangana Ranaut: ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి.. గెహ్రియాన్‌పై కంగనా వ్యాఖ్యలు!

కాగా, పుష్ప సినిమా ద్వారా తమిళంలో ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ తో ప్రమోషన్ చేయించి ఆహాకు మరింత క్రేజ్ వచ్చేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు బేస్ తో ప్రారంభమైన ఓటీటీ ఆహా ఇతర బాషా చిత్రాలను ఇక్కడ డబ్ చేసి ప్రసారం చేస్తోంది. ఇలా ఈ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఆహా ఇకపై తమిళ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైంది. తమిళ ఆహాకు సంబంధించి దర్శకుడు వంశీ పైడిపల్లి అద్వర్యంలో ఓ టీమ్ పనిచేస్తుండగా.. తమిళంలో కూడా అల్లు అర్జున్ తో పాటు మరో స్టార్ హీరోతో కూడా ప్రమోట్ చేయిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.