Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మహేష్-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట నుండి కళావతి..

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

Kalavathi Lyrical Song

Kalavathi Lyrical Song: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మహేష్-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ వచ్చేసింది. నిజానికి ఈపాటని వేలంటైన్ డే రోజున రిలీజ్ చేయాలనున్నారు. అయితే.. శనివారమే ఈ పాట లీకవడంతో లీక్ సాంగ్ తో ఒరిజినల్ ఫీల్ పోతుందని భావించిన మేకర్స్ ఆదివారమే ఈ పాట విడుదల చేసేశారు.

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

సర్కారు వారి పాట నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవబోతోందని సంగీత దర్శకుడు తమన్ ముందే చెప్పినట్లుగానే ఈ పాట రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద ఈ పాట రొమాంటిక్‌గా చిత్రీకరించారు. హీరోయిన్ ను ఉద్దేశించి తనను ఎలా ఆకట్టుకుంటుందో హీరో చెప్పేలా రాసిన ఈ లైన్స్ కు సింగర్ సిద్ శ్రీరామ్ ప్రాణం పోశాడు.

Raviteja : ‘ఖిలాడీ’ మూవీ ఆపాలంటూ కేసు వేసిన బాలీవుడ్ నిర్మాత

వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో మెరుపులు మీదకి దూకినయా.. ఏందే నీ మాయ.. ముందో, అటుపక్కో.. ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినయా.. పోయిందే సోయ.. ఇట్టంటివి నాకు అలవాటే లేదే.. అట్టాటి నాకీ ఈ తడబాటసలేందే.. అంటూ సాగే ఈ పాటలో కళ్ళా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి అంటూ.. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకి తమన్ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు.

Siddhu Jonnalagadda : ‘డిజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 4 కోట్లు.. చిన్న సినిమాకి పెద్ద కలెక్షన్స్..

ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మహేశ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ మహేష్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా.. ప్రేక్షకులలో హైప్ పెంచే పనిలో పడింది యూనిట్. అందులో భాగంగానే ఒక్కో పాటని విడుదల చేస్తూ ప్రమోషన్లు చేపడుతున్నారు.