KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

కరోనా తగ్గడంతో ల్యాబ్స్ లో ఉన్న సినిమాలన్నీ థియేటర్ల మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వరసగా రిలీజ్ డేట్స్ ఇచ్చేసిన మేకర్స్ ఇప్పుడు ఎవరికి వారు ప్రమోషన్ల పనులలో..

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

Kgf Chapter 2

KGF 2: కరోనా తగ్గడంతో ల్యాబ్స్ లో ఉన్న సినిమాలన్నీ థియేటర్ల మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వరసగా రిలీజ్ డేట్స్ ఇచ్చేసిన మేకర్స్ ఇప్పుడు ఎవరికి వారు ప్రమోషన్ల పనులలో ఉన్నారు. టీజర్ల నుండి ట్రైలర్ల వరకు.. సింగిల్స్ నుండి వీడియో సాంగ్స్ వరకు ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాల మీద హైప్స్ పెంచేస్తున్నారు. క్రేజీ సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఇప్పటికే ప్రమోషన్ల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.

Raviteja : ‘ఖిలాడీ’ మూవీ ఆపాలంటూ కేసు వేసిన బాలీవుడ్ నిర్మాత

కాగా, ఇప్పుడు మరో క్రేజీ సౌత్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న సినిమా కేజీఎఫ్ 2 కూడా ప్రమోషన్లు మొదలు పెడుతుంది. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ సరికొత్త రికార్డులను సృష్టించింది. సినిమా విడుదలకి సరిగ్గా రెండు నెలలే టైం ఉండడంతో క్రేజీ అప్డేట్స్ ప్రమోషన్లు మొదలు పెట్టేందుకు సిద్ధమైంది కేజేఎఫ్ 2 టీమ్.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్‌ని లీక్ చేసిన వ్యక్తులు అరెస్ట్

ఈ నెల 25న ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇవ్వాలనే ఇలా అనౌన్సమెంట్ లేకుండా పాటని తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ప్రకటన ఇచ్చే రిలీజ్ చేస్తారా లేక సర్ప్రైజ్ గా రిలీజ్ చేస్తారా అన్నది చూడాల్సి ఉండగా.. ఈ సినిమా అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.