Raviteja : ‘ఖిలాడీ’ మూవీ ఆపాలంటూ కేసు వేసిన బాలీవుడ్ నిర్మాత

ఖిలాడి సినిమా దర్శకనిర్మాతలపై బాలీవుడ్‌ నిర్మాత రతన్‌ జైన్‌ కేసు పెట్టారు. ఈ విషయం గురించి అతడు మీడియాతో మాట్లాడుతూ.. ''ఖిలాడీ పేరుతో దక్షిణాదిలో సినిమా తెరకెక్కుంతుదన్న విషయం....

Raviteja :  ‘ఖిలాడీ’ మూవీ ఆపాలంటూ కేసు వేసిన బాలీవుడ్ నిర్మాత

Khiladi (1)

 

 

Khiladi :   మాస్‌ మహారాజ రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ‘ఖిలాడీ’ సినిమా ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఖిలాడి సినిమా దర్శకనిర్మాతలపై బాలీవుడ్‌ నిర్మాత రతన్‌ జైన్‌ కేసు పెట్టారు.

ఈ విషయం గురించి అతడు మీడియాతో మాట్లాడుతూ.. ”ఖిలాడీ పేరుతో దక్షిణాదిలో సినిమా తెరకెక్కుంతుదన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ మధ్యే ట్రైలర్‌ చూశాక తెలిసింది. ట్రేడ్‌ మార్క్‌ యాక్ట్‌ కింద ఇదివరకే ఖిలాడీ టైటిల్‌ను నేను రిజిస్టర్‌ చేయించాను. అక్షయ్ కుమార్ తో గతంలోనే ఖిలాడీ టైటిల్ తో సినిమా నిర్మించాను. ఆ సినిమా భారీ విజయం సాధించింది.

చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. ‘డీజే టిల్లు’

కాబట్టి ఆ సినిమా టైటిల్ మార్చాలి. నేను డబ్బులు ఆశించడం లేదు. నా ఖిలాడి సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నాను. దక్షిణాదిన లోకల్‌ అసోసియేషన్స్‌లో టైటిల్‌ రిజిస్టర్‌ చేయించి వారి సినిమాలను అదే టైటిల్‌తో హిందీలో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. హిందీ సినిమా టైటిల్స్‌కు దగ్గరగా ఉండే డబ్బింగ్‌ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు సీబీఎఫ్‌సీ పర్మిషన్‌ ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుంది. అయితే ఖిలాడీ కేవలం సౌత్ లోనే రిలీజ్ అనుకున్నాను, కానీ హిందీలో రిలీజ్‌ అవుతున్న విషయం కూడా నాకు తెలీదు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను మార్చేవరకు రిలీజ్‌ను ఆపాలని కోర్టును సంప్రదించాను.” అని తెలిపారు.

Siddhu Jonnalagadda : ‘డిజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 4 కోట్లు.. చిన్న సినిమాకి పెద్ద కలెక్షన్స్..

అయితే ఇప్పటికే సినిమా రిలీజ్ అయిపొయింది కాబట్టి ఈ విషయంలో ఏమి చేయలేము అని కోర్టు వ్యాఖ్యానించడంతో కనీసం తర్వాత ఓటీటీ రిలీజ్‌ను అయినా ఆపాలని కోర్టుకు తెలిపారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అలాగే ఇప్పటివరకు ఈ వివాదంపై ఖిలాడీ చిత్రయూనిట్‌ ఇంకా స్పందించలేదు.