Siddhu Jonnalagadda : ‘డిజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 4 కోట్లు.. చిన్న సినిమాకి పెద్ద కలెక్షన్స్..

సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ వచ్చింది ఈ సినిమాకి. ‘డిజే టిల్లు’ టైటిల్ సాంగ్ అయితే అంతటా మోగిపోతుంది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు..........

Siddhu Jonnalagadda :  ‘డిజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 4 కోట్లు.. చిన్న సినిమాకి పెద్ద కలెక్షన్స్..

Dj Tillu Collections

DJ Tillu :  యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజే టిల్లు’. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం ఫిబ్రవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది ‘డిజే టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంటుంది. అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకి.

సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ వచ్చింది ఈ సినిమాకి. ‘డిజే టిల్లు’ టైటిల్ సాంగ్ అయితే అంతటా మోగిపోతుంది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక చిత్ర యూనిట్ పెట్టిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా నా కెరీర్‌లో నేను బ్లాక్‌ బస్టర్‌ అనే మాట వినలేదు. నా కెరీర్ లో ఇదే ఫస్ట్ బ్లాక్ బస్టర్” అన్నారంటే సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

Siddhu Jonnalagadda : నా కెరీర్లో బ్లాక్‌బస్టర్ అనే మాట ఫస్ట్ టైం వింటున్నా: ‘డీజే టిల్లు’ హీరో

ఇక ఈ చిన్న సినిమా కలెక్షన్స్ ని మాత్రం భారీగా సాధించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ మొత్తం 4 కోట్ల షేర్ కలెక్షన్స్ ని సాధించింది. షేర్ కలెక్షన్సే 4 కోట్లు ఉంటే గ్రాస్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇక ఒక్క నైజామ్ లోనే దాదాపు 1.63 కోట్ల షేర్ కలెక్షన్స్ ని సాధించింది. మొదటి రోజే ఇంత భర్తీ కలెక్షన్స్ సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సినిమా టీం. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఒక్కరోజులోనే వచ్చేసిందని సమాచారం. దీంతో ‘డీజే టిల్లు’ సినిమా ఫుల్ లాభాలు తెచ్చుకోబోతుంది.