Siddhu Jonnalagadda : నా కెరీర్లో బ్లాక్‌బస్టర్ అనే మాట ఫస్ట్ టైం వింటున్నా: ‘డీజే టిల్లు’ హీరో

మూడు రోజుల వరకు రిలీజ్ అయిన థియేటర్స్ అన్నిటిలో అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి అంటే ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ వచ్చాక........

Siddhu Jonnalagadda :  నా కెరీర్లో బ్లాక్‌బస్టర్ అనే మాట ఫస్ట్ టైం వింటున్నా: ‘డీజే టిల్లు’ హీరో

Dj Tillu (1)

DJ Tillu :  యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజే టిల్లు’. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం ఫిబ్రవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది ‘డిజే టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంటుంది. అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకి.

మూడు రోజుల వరకు రిలీజ్ అయిన థియేటర్స్ అన్నిటిలో అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి అంటే ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ వచ్చాక చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా నా కెరీర్‌లో నేను బ్లాక్‌ బస్టర్‌ అనే మాట వినలేదు. ఈ సినిమాతో విన్నాను. థియేటర్స్ లో నా సినిమా ఇంత భారీగా రిలీజ్ అయి, ఇంత మంచి విజయం సాధించింది అంటే నమ్మలేకపోతున్నాను. ఈ సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా కెరీర్ లో ఇదే ఫస్ట్ బ్లాక్ బస్టర్” అని తెలిపారు.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్‌ని లీక్ చేసిన వ్యక్తులు అరెస్ట్

ఇక డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘థియేటర్లో ప్రేక్షకుల సందడి చూసి ఈ సినిమా ఇంత హిట్ అయిందని నమ్మలేకపోయాం. డైలాగ్స్‌కి వస్తున్న క్రెడిట్‌ని హీరో సిద్ధూకి ఇస్తాను. నాగవంశీగారి నమ్మకం, మా టీమ్‌ కష్టం ఈ విజయానికి కారణం’’ అని అన్నారు.