Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్‌ని లీక్ చేసిన వ్యక్తులు అరెస్ట్

వాలెంటైన్స్ డే రోజు సాంగ్ రిలీజ్ అయ్యేలోపే కళావతి సాంగ్ బయటకి లీక్ అయింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి ఏం చేయాలో తోచలేదు. గతంలో కూడా మైత్రి సంస్థలో ఇలాగే లీకులు జరిగాయి......

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్‌ని లీక్ చేసిన వ్యక్తులు అరెస్ట్

Sarkaru Vari Paata (1)

Sarkaru Vaari Paata :  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. జనవరిలో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. పరుశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు.

ఈ పాటకి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. కళావతి అంటూ సాగే ఈ పాట ప్రోమో అభిమానుల్ని మెప్పించింది. అభిమానులు ఈ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వాలెంటైన్స్ డే రోజు సాంగ్ రిలీజ్ అయ్యేలోపే కళావతి సాంగ్ బయటకి లీక్ అయింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి ఏం చేయాలో తోచలేదు. గతంలో కూడా మైత్రి సంస్థలో ఇలాగే లీకులు జరిగాయి. ఇప్పటికే ఈ సాంగ్ లీకేజ్ పై సినిమా యూనిట్ నుంచి పలువురు స్పందించారు.

Jagapathi Babu : అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు, పద్మ భూషణ్‌లు ఇవ్వాలి

అయితే పాట ఎక్కడి నుంచి లీక్ అయిందో గుర్తించాలని తమన్, మైత్రి సంస్థ అధినేతలు బరిలోకి దిగి విచారణ చేపట్టారు. అటు పోలీసులకి కూడా కంప్లైంట్ చేశారు. చివరికి పాటను లీక్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను మైత్రి సంస్థ నిర్వాహకులు గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దర్నీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక పాట ముందే లీక్ అవ్వడంతో వాలైంటైన్స్‌ డే సందర్భంగా విడుదల కావాల్సిన కళావతి పాటని ఒకరోజు ముందే విడుదల చేస్తున్నారు.