Jagapathi Babu : అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు, పద్మ భూషణ్‌లు ఇవ్వాలి

సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఈ అవయవ దానం అవగాహన కార్యక్రమంలో జగపతిబాబు మాట్లాడుతూ.. ''నా 60వ పుట్టిన రోజు సందర్భంగా సినిమాల్లో హీరో కన్నా, జీవితంలో హీరో...

Jagapathi Babu : అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు, పద్మ భూషణ్‌లు ఇవ్వాలి

Jagapathi Babu

Updated On : February 13, 2022 / 11:30 AM IST

Jagapathi Babu :   ఒకప్పటి హీరో జగపతిబాబు ‘లెజెండ్’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. వరుస సినిమాలు చేస్తున్నారు. నిన్న జగపతిబాబు 60వ పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఈ అవయవ దానం అవగాహన కార్యక్రమంలో జగపతిబాబు మాట్లాడుతూ.. ”నా 60వ పుట్టిన రోజు సందర్భంగా సినిమాల్లో హీరో కన్నా, నిజ జీవితంలో హీరో అవ్వాలని ఉద్దేశ్యంతో అవయవ దానం చేస్తున్నాను. మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు. అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత ఏడుగురికి అయినా పునర్జన్మ ఇవ్వొచ్చు. అవయవ దానం చేసిన వాళ్ళకి ప్రభుత్వం పద్మశ్రీలు, పద్మభూషణ్ లు ఇవ్వాలి” అని తెలిపారు.

Allu Arjun : తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్ ఎండి భాస్కర్ రావు, సీనియర్ IAS అధికారి జయేష్ రంజాన్, జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత, అక్కినేని నాగసుశీల కూడా పాల్గొన్నారు. జగపతిబాబు తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.