Airtel OTT Plans Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఈ డేటా ప్లాన్లతో 14కు పైగా OTT ఛానళ్లు ఫ్రీ.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel OTT Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) బంపర్ ఆఫర్ ప్రకటించింది. OTT బెనిఫిట్స్ కోరుకునే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అద్భుతమైన డేటా ప్లాన్లను అందిస్తోంది. అదనపు OTT బండిల్‌తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.

Airtel OTT Plans Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఈ డేటా ప్లాన్లతో 14కు పైగా OTT ఛానళ్లు ఫ్రీ.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel Rs 149 plan offers free access to SonyLIV, 14 other OTT platforms, and more benefits

Airtel OTT Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) బంపర్ ఆఫర్ ప్రకటించింది. OTT బెనిఫిట్స్ కోరుకునే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అద్భుతమైన డేటా ప్లాన్లను అందిస్తోంది. అదనపు OTT బండిల్‌తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌ల ధరలు రూ. 399 వరకు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఈ ప్లాన్ల ద్వారా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. నిర్దిష్ట OTT ఛానెల్‌లు లేకుండా కేవలం ఎంటర్‌టైన్మెంట్ ప్యాక్ కోసం చూస్తున్న కొంతమంది యూజర్లకు ఈ OTT బండిల్ ప్యాక్‌ కాస్తా ఖరీదైనది. అందుకే Airtel తమ యూజర్లకు 15 కన్నా ఎక్కువ OTT ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించే స్పెషల్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 149 ధరతో Airtel Xstreme యాప్‌కి ఉచితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.

ఇందులో Sony Liv, LionsgatePlay, Hoichoi, మరిన్నింటితో సహా మల్టీ OTT ఛానెల్‌లకు ఉచితంగా యాక్సెస్ అందిస్తుంది. OTT బెనిఫిట్స్ కోరుకునే ఎయిర్‌టెల్ యూజర్లు తక్కువ ఖర్చుతోనే రూ. 149 ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ ప్లాన్ రీఛార్జ్ ప్లాన్ కాదని గమనించాలి. కేవలం డేటా యాడ్ ఆన్ ప్యాక్.. అందుకే వినియోగదారులు యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్‌ని కలిగి ఉంటే మాత్రమే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయవచ్చు. OTT బెనిఫిట్స్ కూడిన ఎయిర్‌టెల్ రూ. 149 డేటా యాడ్-ఆన్ ప్యాక్ కింద పొందవచ్చు. ఏయే డేటా ప్లాన్లపై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Best Laptops : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఈ ఫిబ్రవరిలో రూ. 40వేల లోపు ధరకే బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

ఎయిర్‌టెల్ రూ.149 డేటా ప్లాన్ :
ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్యాక్‌తో సమానంగా 1GB డేటాను అదే వ్యాలిడిటీతో అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే ఎయిర్‌టెల్ Xstreme ప్రీమియం 30 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్యాక్‌లో SonyLIV, Eros Now, ShemarooME, Hoichoi, Ultra, LionsgatePlay, Epicon, ManoramaMax, Dollywood Play, Divo, Klikk, Namaflix, HungamaPlay, Docubay, SocialSwag, ShortsTV, Chaupal, Kanccha లతో సహా 15 కన్నా ఎక్కువ OTTలకు యాక్సెస్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ మరింత డేటాను పొందాలంటే.. Airtel Xtreamకు యాక్సెస్‌ని అందించే సరసమైన ధరలతో మరో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ ప్లాన్ ధర రూ. 148 ఉండగా.. Airtel Xtreamకి 28 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

Airtel Rs 149 plan offers free access to SonyLIV, 14 other OTT platforms, and more benefits

Airtel Rs 149 plan offers free access to SonyLIV, 14 other OTT platforms

ఎయిర్‌టెల్ రూ.148 డేటా ప్లాన్ :
రూ. 150 లోపు ప్లాన్లలో ఈ ప్రీపెయిడ్ డేటా యాడ్ ఆన్ ప్లాన్.. ప్రస్తత ప్లాన్ వ్యాలిడిటీపై 15GB అదనపు డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు Xtream యాప్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. అయితే వినియోగదారులు ఆఫర్ల నుంచి 1 ఛానెల్‌ని మాత్రమే ఎంచుకోగలరు. మొత్తం 15 ఛానెల్‌లలో ఈ ప్లాన్ కేవలం ఒక OTT యాప్‌కు మాత్రమే ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. రూ.149 ప్లాన్ మరిన్ని OTT ఛానెల్‌లను అందిస్తే.. రూ.148 మరింత డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా రెండు ఎంపికలను ఎంచుకోవచ్చు.

Airtel రూ. 155 ప్రీపెయిడ్ ప్లాన్  :
ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో టెలికాం ఆపరేటర్ బడ్జెట్ ప్యాక్ ధర రూ.155 ఒకటిగా ఉంది. 24 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ 1GB మొత్తం డేటాను అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMSలను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే.. హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్‌కి ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.

Read Also : Tecno Pop 7 Pro Launch : భారీ బ్యాటరీతో టెక్నో పాప్ 7 ప్రో బడ్జెట్ ఫోన్.. ధర కేవలం రూ. 6,799 మాత్రమే.. సేల్ ఎప్పటినుంచంటే?