Tecno Pop 7 Pro Launch : భారీ బ్యాటరీతో టెక్నో పాప్ 7 ప్రో బడ్జెట్ ఫోన్.. ధర కేవలం రూ. 6,799 మాత్రమే.. సేల్ ఎప్పటినుంచంటే?
Tecno Pop 7 Pro Launch : చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు బ్రాండ్ టెక్నో మొబైల్ (Tecno Mobile) భారత మార్కెట్లో పాప్ సిరీస్ కింద కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ సబ్-7K స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ కింది లిస్టు అయింది.

Tecno Pop 7 Pro launched in India with 5000mAh battery, price starts Rs 6,799
Tecno Pop 7 Pro Launch : చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు బ్రాండ్ టెక్నో మొబైల్ (Tecno Mobile) భారత మార్కెట్లో పాప్ సిరీస్ కింద కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ సబ్-7K స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ కింది లిస్టు అయింది. కొత్తగా లాంచ్ అయిన టెక్నో పాప్ 7 ప్రో బెస్ట్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్, పెద్ద డిస్‌ప్లేతో వచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసే యూజర్ల కోసం కంపెనీ రూపొందించింది. Tecno Pop 7 Pro ఇన్-బాక్స్ 10W టైప్ C ఛార్జర్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. Tecno 29-రోజుల స్టాండ్‌బై సమయంతో పాటు 156 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ 12-MP AI-రెడీ డ్యూయల్ వెనుక కెమెరాతో పాటు 3G RAM 64GB స్టోరేజ్ వేరియంట్‌లతో పాటు లాగ్-ఫ్రీ ఆపరేషన్‌లు, మెరుగైన స్టోరేజీని కలిగి ఉంది.
కొత్త లాంచ్‌పై మాట్లాడుతూ.. TECNO మొబైల్ CEO అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ.. ‘హైస్పీడ్ ఇంటర్నెట్ విస్తరణతో పాటు ఎప్పటికప్పుడు పెరుగుతున్న కంటెంట్ వినియోగంతో సబ్ 8K విభాగంలో అధిక నాణ్యత గల డివైజ్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. Tecno Pop 7తో Pro లాంచ్ ద్వారా బిగ్ ర్యామ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్పెషిఫికేషన్లను అందిస్తున్నాం. కొత్త స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 5000mAh బ్యాటరీ వంటి ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 12MP కెమెరాతో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం భారీ డిస్‌ప్లేకు కూడా సపోర్టు ఇస్తుంది’ అని ఆయన తెలిపారు.
టెక్నో పాప్ 7 Pro : ధర ఎంతంటే? :
Tecno Pop 7 Pro మోడల్ 2GB+64GB, 3GB+64GB స్టోరేజ్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. దీని ధర వరుసగా రూ.6,799, రూ.7,299గా ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 22 నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon Sale)లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Tecno Pop 7 Pro launched in India with 5000mAh battery
టెక్నో పాప్ 7 ప్రో స్పెసిఫికేషన్‌లివే :
Tecno Pop 7 Proలో 6.56-అంగుళాల HD+ డాట్ నాచ్ డిస్‌ప్లే 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో పాటు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. డిస్‌ప్లే 1612×720 రిజల్యూషన్‌తో 20:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియోతో గరిష్టంగా 480నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. IPX2 రేటింగ్‌తో ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ ముందు.. స్మార్ట్‌ఫోన్ Android 12 ఆధారంగా HiOS 11.0పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ MediaTek Helio A22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Tecno Pop 7 Pro 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
రెండు RAM వేరియంట్‌లలో లభిస్తుంది. 4 GB (2GB RAM+ 2GB RAM), 6GB (3GB RAM + 3GB RAM) ఉంటాయి. టెక్నో Pop 7 Pro 4G స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ 5.0 సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5000mAhతో 10W టైప్-C ఛార్జర్‌తో 29 రోజుల వరకు స్టాండ్‌బైలో ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్‌లో AI మోడ్‌ల సపోర్టుతో 12-MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందు, స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్‌తో 5-MP సెల్ఫీ షూటర్ ఉంది.