Aishwarya : ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు.. ధనుష్‌తో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన ఐశ్వర్య

తాజాగా విడాకుల తర్వాత మొదటిసారి ఐశ్వర్య స్పందించింది. ప్రస్తుతం ఐశ్వర్య ఒక లవ్ సాంగ్ డైరెక్షన్ చేస్తుంది. దీంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ గురించి అడగగా ఐశ్వర్య మాట్లాడుతూ.........

Aishwarya : ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు.. ధనుష్‌తో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన ఐశ్వర్య

Aishwaryaa

 

Aishwarya :  ఇటీవల కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్తూ ఇద్దరూ విడిపోయారు. వీరు విడిపోతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే వీరిద్దర్నీ కలపడానికి అటు ధనుష్ ఫ్యామిలీ, ఇటు ఐశ్వర్య ఫ్యామిలీ ఎంతగానో ప్రయత్నించారు. రజినీకాంత్ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇక విడాకుల తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరూ విడాకులపై స్పందించలేదు

 

తాజాగా విడాకుల తర్వాత మొదటిసారి ఐశ్వర్య స్పందించింది. ప్రస్తుతం ఐశ్వర్య ఒక లవ్ సాంగ్ డైరెక్షన్ చేస్తుంది. దీంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ గురించి అడగగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ”జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవాల్సిందే. ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ, ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు.” అని తెలిపింది.

Babli Bouncer : మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా

అయితే ఈ మాటల్ని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది నెటిజన్లు ప్రేమని ఎంతమందికి పంచుతారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురాలేదు.