Babli Bouncer : మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా

హీరోయిన్ త‌మ‌న్నా మ‌ట్లాడుతూ... “నా కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. మ‌ధుర్.....

Babli Bouncer : మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా

Tamanna

Tamannaah :  ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16 ఏళ్లకు పైగా అయినా ఇంకా తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో తన సత్తా చాటుతూ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది తమన్నా. ఇప్పటికే తమన్నా చేతిలో దాదాపు 8 సినిమాలు ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు తమన్నా ఎంత బిజీగా ఉందో. తాజాగా బాలీవుడ్ లో తన మరో సినిమాని ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఈ సారి అలరించనుంది.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో తమన్నా మెయిన్ లీడ్ గా ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చ‌ర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.

Pawan Kalyan : అమెరికాలో 400కి పైగా థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ విడుదల

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ మ‌ధుర్ భండార్క‌ర్ మాట్లాడుతూ….. “గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా బ‌బ్లీ బౌన్స‌ర్ ఉండబోతుంది. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ మహిళా బౌన్స‌ర్ గా నటిస్తుంది. భార‌త‌దేశంలో తొలిసారిగా ఓ మహిళా బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలి సినిమా ఇదే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాము” అని తెలిపారు.

Ram Charan : ఆగిపోయిన రామ్ చరణ్ బిజినెస్.. నష్టాల్లో ట్రూజెట్..

హీరోయిన్ త‌మ‌న్నా మ‌ట్లాడుతూ… “నా కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టించ‌డం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో న‌న్ను ప్రేక్షకులు మ‌రింతగా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను” అని తెలిపారు.