Pawan Kalyan : అమెరికాలో 400కి పైగా థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ విడుదల

మన దేశంలో పాటు విదేశాల్లో కూడా 'భీమ్లా నాయక్' సినిమాని భారీగా రిలీజ్ చేయనున్నారు. అమెరికాలో దాదాపు 400కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం.........

Pawan Kalyan : అమెరికాలో 400కి పైగా థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ విడుదల

Bheemla Nayak

Bheemla Nayak :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రానాతో కలిసి చేసిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగా సాగర్ చంద్ర తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా భారీగా రిలీజ్ అవ్వబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరోసారి మాస్ క్యారెక్ట చేయడం, సాంగ్స్ కూడా వైరల్ అవ్వడం, మలయాళం హిట్ సినిమా రీమేక్ కావడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిత్ర యూనిట్ కూడా అదే రేంజ్ లో సినిమా గురించి చెప్తుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా త్వరలోనే నిర్వహించనున్నారు.

Ram Charan : ఆగిపోయిన రామ్ చరణ్ బిజినెస్.. నష్టాల్లో ట్రూజెట్..

ఇటీవలే ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మన దేశంలో పాటు విదేశాల్లో కూడా ‘భీమ్లా నాయక్’ సినిమాని భారీగా రిలీజ్ చేయనున్నారు. అమెరికాలో దాదాపు 400కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కూడా ‘భీమ్లా నాయక్’ సినిమా రచ్చ చేయనున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో ఉన్న పవన్ అభిమానులు ఇప్పటికే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారట. ఫిబ్రవరి 24నే అక్కడ అమెరికాలో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ సారి ‘భీమ్లా నాయక్’ ఏ రేంజ్ సునామి సృష్టిస్తుందో చూడాలి.