Ram Charan : ఆగిపోయిన రామ్ చరణ్ బిజినెస్.. నష్టాల్లో ట్రూజెట్..

తన స్నేహితుడు ఉమేష్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థను ప్రారంభించారు రామ్ చరణ్. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో ఈ సంస్థను మొదలుపెట్టారు. ఈ సంస్థ.......

Ram Charan : ఆగిపోయిన రామ్ చరణ్ బిజినెస్.. నష్టాల్లో ట్రూజెట్..

Ram Charan

Trujet :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాక నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా కూడా కష్టపడుతున్నారు. రామ్ చరణ్ కి సినిమాలే కాక అనేక రకాల బిజినెస్ లు ఉన్నాయి. అందులో విమానయాన సంస్థ కూడా ఒకటి. ట్రూజెట్ పేరుతో ఇండియాలో డొమెస్టిక్ విమానాలు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ట్రూజెట్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

తన స్నేహితుడు ఉమేష్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థను ప్రారంభించారు రామ్ చరణ్. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో ఈ సంస్థను మొదలుపెట్టారు. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. జులై 12వ తేదీ 2015 లో ఈ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు నిరాటకంగా ఈ విమానాలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో మునిగింది.

Eesha Rebba : లిప్‌లాక్, రొమాన్స్‌లతో రెచ్చిపోయిన ఈషారెబ్బ

ట్రూజెట్ విమానాలు నష్టాల్లో ఉండటంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వట్లేదని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనని విడుదల చేశారు. ఈ ప్రకటనలో..” ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనేది అబద్దమైన వార్తలు. ఇలాంటి వార్తలని నమ్మొద్దు. ఈ సంస్థలో పని చేసే టాప్ ఆఫీసర్స్ ఇద్దరు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఓ ఇన్వెస్టర్ కూడా రానున్నారు. ఆ ఇన్వెస్టర్ వచ్చాక కొత్త సీఈఓని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉమేష్ గారే కొనసాగనున్నారు.

Nanditha Das : హీరోయిన్ డైరెక్షన్‌లో డెలివరీ బాయ్‌గా కపిల్ శర్మ

వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలికంగా ఆటంకం కలిగింది. కొన్ని రోజులు మాత్రమే ఈ విమానాల్ని ఆపుతున్నాము. షార్ట్ నోటీసులో మళ్ళీ పునఃప్రారంభిస్తాము. నవంబర్ 2021 నుండి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని చెప్పే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారికి పాక్షిక జీతాలు ఇస్తున్నాము. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చాము.” అని ఈ ప్రకటనలో తెలిపారు. మరి వారు చెప్పినట్టు కొత్త ఇన్వెస్టర్ వస్తారా, ట్రూజెట్ విమానాలు మళ్ళీ ఎగురుతాయా తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.